Share News

POLYSET : సార్‌.. మీ కాళ్లు పట్టుకుంటా..!

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:31 AM

తన కుమారుడి చేత పాలిసెట్‌ రాయించేందుకు ఓ తల్లి పడ్డ ఆవేదన అందరినీ కలిచివేసింది. కానీ అధికారులు మాత్రం కనికరం చూపలేదు. అనంతపురం నగరంలోని ఎస్‌ఎ్‌సబీఎన కళాశాల కేంద్రంలో పాలిసెట్‌ రాసేందుకు గుత్తి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన నితిన.. తన తల్లి లక్ష్మిదేవితో కలిసి శనివారం వచ్చాడు. ఉదయం 8 గంటలకే బయలుదేరినా.. బస్సులు, ఆటోలు సమయానికి దొరక్కపోవడం, ట్రాఫిక్‌ సమస్య కారణంగా ఆలస్యమైంది. పరీక్ష ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగా.. వారు 11.05 గంటలకు కళాశాల వద్దకు చేరుకున్నారు. నితిన పరుగున వెళ్లినా..

POLYSET : సార్‌.. మీ కాళ్లు పట్టుకుంటా..!
Student Nithina and mother Lakshmi Devi are in tears

నా కొడుకును పరీక్ష రాయనివ్వండి

ఎస్‌ఎస్‌బీఎన వద్ద విద్యార్థి తల్లి కంటతడి..

ఆలస్యానికి అనుమతించని పాలిసెట్‌ అధికారులు

అనంతపురం సెంట్రల్‌, ఏప్రిల్‌ 27: తన కుమారుడి చేత పాలిసెట్‌ రాయించేందుకు ఓ తల్లి పడ్డ ఆవేదన అందరినీ కలిచివేసింది. కానీ అధికారులు మాత్రం కనికరం చూపలేదు. అనంతపురం నగరంలోని ఎస్‌ఎ్‌సబీఎన కళాశాల కేంద్రంలో పాలిసెట్‌ రాసేందుకు గుత్తి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన నితిన.. తన తల్లి లక్ష్మిదేవితో కలిసి శనివారం వచ్చాడు. ఉదయం 8 గంటలకే బయలుదేరినా.. బస్సులు, ఆటోలు సమయానికి దొరక్కపోవడం, ట్రాఫిక్‌ సమస్య కారణంగా ఆలస్యమైంది. పరీక్ష ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగా.. వారు 11.05 గంటలకు కళాశాల వద్దకు చేరుకున్నారు. నితిన పరుగున వెళ్లినా.. అప్పటికే ప్రధాన గేటు మూసివేశారు. అక్కడి సిబ్బందిని బతిమాలినా అనుమతించలేదు. కుమారుడు పరీక్ష రాసేందుకు వెళ్లాడని భావించిన తల్లి.. బయటే ఉండిపోయింది. కానీ కుమారుడు ఏడుస్తూ తిరిగిరావడంతో ఆమె తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. కుమారుడితో కలిసి పరుగు పరుగున ప్రధాన ద్వారం వద్దకు వెళ్లి అధికారులను బతిమాలారు. అయినా కనికరించకపోవడంతో కంటతడి పెట్టుకున్నారు. ‘సార్‌.. మీ కాళ్లు మొక్కుతా..


నా కొడుకును లోపలికి పంపండి. వాడి భవిష్యత్తును నాశనం చేయకండి సార్‌’ అని ఆమె విలపించారు. కూలి పనులు చేసి కొడుకును చదివిస్తున్నానని, పదో తరగతిలో 506 మార్కులు సాధించాడని ఆమె తెలిపారు. అదే సమయానికి మరో నలుగురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. వారందరూ ఎంత వేడుకున్నా అధికారులు గేటు తీయలేదు. ఏం చేయాలో తోచక డయల్‌ 100కి ఫోన చేశారు. ఇద్దరు కానిస్టేబుల్స్‌ అక్కడికి చేరుకుని విషయం తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడేసరికి సమయం 11.40 అయింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు నిరాశగా వెనుదిరిగారు. జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలలో ఆలస్యం కారణంగా కొందరు విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయారు. జిల్లా వ్యాప్తంగా 8,898 మంది విద్యార్థులకుగాను 1,081 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జయచంద్రారెడ్డి తెలిపారు.

ఇంత కఠినమా..?

నార్పల నుంచి నగరంలోకి వచ్చేసరికి ట్రాఫిక్‌ జామ్‌ అయింది. దీంతో 11.07 గంటలకు పరీక్షా కేంద్రానికి చేరుకున్నాను. నా కూతురును పరీక్షకు అనుమతించలేదు. ప్రభుత్వ అధికారులు ఇంత కఠినంగా వ్యహరిస్తే ఎలా? విద్యార్థులు, తల్లిదండ్రులు వేడుకున్నా అధికారులు స్పందిచకపోవడం దారుణం. పోలీసులు వచ్చి అడిగినా పట్టించుకోలేదు. విద్యార్థులను పరీక్షలు రాయనివ్వకపోవడమే ప్రభుత్వం పనిగా పెట్టుకున్నట్లుంది.

- రామాంజనేయులు, విద్యార్థిని తండ్రి, నాయనవారిపల్లి


అనుమతించలేదు..

ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చానని పరీక్షకు అనుమతించలేదు. సిద్దరాంపురం నుంచి అనంతపురం రావడానికి అటోలు, బస్సులు దొరకలేదు. దీంతో పరీక్షా కేంద్రానికి రావడానికి ఆలస్యమైంది. అధికారులను వేడుకున్నా గేటుతీయలేదు. ఏడాదికి ఒకసారి మాత్రమే నిర్వహించే పాలిసెట్‌ను మళ్లీ రాయలేం. కష్టపడి చదివాను. శ్రమ వృథా అయింది.

- చందన, విద్యార్థిని

మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Apr 28 , 2024 | 12:31 AM