Share News

AMIYLINENI SURENDRABABU : అభివృద్ధి ఏమిటో చూపిస్తా..!

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:03 AM

ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు చూపిస్తానని టీడీపీ కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. ఆయన నామినేషన మహోత్సవానికి హాజరైన జనంతో కళ్యాణదుర్గం వీధులు గురువారం పోటెత్తాయి. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి జనం ప్రభంజనంలా తరలివచ్చారు. పసుపు జెండా చేతబట్టి జై తెలుగుదేశం.. జై చంద్రబాబు... జై అమిలినేని అంటూ నినాదాలతో హోరెత్తించారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా పోటెత్తిన జనానికి అభివాదం చేస్తూ ...

AMIYLINENI SURENDRABABU : అభివృద్ధి ఏమిటో చూపిస్తా..!
Amylineni Surendrababu presenting the nomination paper to RVO Rani Sushmita

ఒక్క అవకాశం ఇవ్వండి.. టీడీపీని గెలిపించండి

ప్రజలకు టీడీపీ కూటమి అభ్యర్థి అమిలినేని వినతి

వేలాది మందితో కళ్యాణదుర్గంలో ర్యాలీ.. నామినేషన

కళ్యాణదుర్గం, ఏప్రిల్‌ 25: ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు చూపిస్తానని టీడీపీ కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. ఆయన నామినేషన మహోత్సవానికి హాజరైన జనంతో కళ్యాణదుర్గం వీధులు గురువారం పోటెత్తాయి. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి జనం ప్రభంజనంలా తరలివచ్చారు. పసుపు జెండా చేతబట్టి జై తెలుగుదేశం.. జై చంద్రబాబు... జై అమిలినేని అంటూ నినాదాలతో హోరెత్తించారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా పోటెత్తిన జనానికి అభివాదం చేస్తూ అమిలినేని సురేంద్రబాబు నామినేషనకు భారీ ర్యాలీతో తరలివెళ్లారు.


దారి పొడవునా అభిమాన జన తరంగం ఆయనపై పూలవర్షం కురిపించింది. పట్టణంలోని ప్రజావేదిక నుంచి గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన భారీ ర్యాలీ.. బ్రహ్మయ్య గుడి మీదుగా వాల్మీకి సర్కిల్‌కు చేరుకుంది. అక్కడ వాల్మీకి విగ్రహానికి అమిలినేని పూలమాలలు వేసి ముందుకు సాగారు. గాంధీ సర్కిల్‌, మసీదు సర్కిల్‌, అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు భారీ ర్యాలీ కొనసాగింది. కాంతార, గొరవయ్యల నృత్య ప్రదర్శన, డీజే సాంగ్స్‌తో ర్యాలీ ఆకట్టుకుంది. ర్యాలీ అనంతరం తన నామినేషన పత్రాన్ని ఆర్‌వో రాణి సుష్మితకు ఆయన అందజేశారు.

మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: అమిలినేని

మసీదు సర్కిల్‌లో అమిలినేని సురేంద్రబాబు ప్రసంగించారు. కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, చంద్రబాబు పరిపాలనపై నమ్మకంతో ఓటు వేయాలని ప్రజలను కోరారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, అన్ని వర్గాల ఆదరాభిమానాలను చూరగొంటానని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో రైతాంగ, విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, సాగునీరు తదితర సమస్యలన్నీ పరిష్కరిస్తానని అన్నారు. మూడేళ్లకాలంలో 114 చెరువులకు కృష్ణా జలాలు తీసుకువచ్చి,


రైతుల మన్ననలు పొందుతామని అన్నారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ స్థలాలను నిరుపయోగంగా వదిలేశారని, వాటిలో కాంప్లెక్స్‌లు నిర్మించి.. మున్సిపల్‌ ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. తన ప్రత్యర్థులు గత ఐదేళ్లలో ఏమి చేశారని ప్రశ్నించారు. మంత్రి ఉష శ్రీచరణ్‌, ఎంపీ రంగయ్య వర్గాలుగా విడిపోయి దోచుకున్నారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఒక్కపైసా అవినీతి చేయకుండా అభివృద్ధి చేస్తానని, తనను గెలిపించాలని అభ్యర్థించారు. వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, చంద్రబాబు పాలన కోరుకుంటున్నారని అన్నారు. ‘ఒక్క చాన్స ఇవ్వండి. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపుతా’ అని హామీ ఇచ్చారు. టీడీపీ జనప్రవాహాన్ని చూసి వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. ప్రజాబలంతో 50 వేల మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నామినేషన మహోత్సవానికి నియోజకవర్గం నుంచి 50 వేల మందికి పైగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, చిన్నారులు భాగస్వాములయ్యారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 26 , 2024 | 12:03 AM