TDP: అనంతలో ఎగిరేది టీడీపీ, జనసేన జెండాలే..: పయ్యావుల

ABN , First Publish Date - 2024-01-27T17:42:00+05:30 IST

వైసీపీ ప్రభుత్వం బిందుసేద్యాన్ని పక్కన పెట్టిందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) అన్నారు. శనివారం నాడు ఉరవకొండలో "రా.. కదలి రా' సభ నిర్వహించారు ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు.

TDP: అనంతలో ఎగిరేది టీడీపీ, జనసేన జెండాలే..: పయ్యావుల

అనతంపురం (ఉరవకొండ): వైసీపీ ప్రభుత్వం బిందుసేద్యాన్ని పక్కన పెట్టిందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) అన్నారు. శనివారం నాడు ఉరవకొండలో "రా.. కదలి రా' సభ నిర్వహించారు ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ... ఈ సభలో ప్రజా వెల్లువ చూస్తేనే రాబోయే ఎన్నికల్లో ఏం జరుగుతోందో తెలుస్తోందన్నారు. అనతంపురం జిల్లాలో ఎగిరేది టీడీపీ, జనసేన జెండాలేనని స్పష్టం చేశారు. ఉరవకొండలో అందించిన సేవలకు సంతృప్తిగా ఉందన్నారు. నీళ్లు ఇస్తే రతనాలు పండించగలమని గతంలో రుజువు చేశామన్నారు. రాయలసీమకు నీళ్లు ఇస్తే మా తలరాతలు మారతాయని చెప్పారు. కరువుతో పోరాడిన ధైర్యం సీమ రైతులకు ఉందని.. టీడీపీ హయాంలో అనేక ప్రాజెక్టులు పూర్తి చేశామని పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2024-01-27T21:02:37+05:30 IST