Chandrababu: దొంగదెబ్బ తీయొద్దంటూ వైసీపీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక
ABN, First Publish Date - 2023-02-24T23:07:20+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) వ్యవహార శైలిపై టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) వ్యవహార శైలిపై టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై కూడా చంద్రబాబు (Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డిని నమ్మినవాళ్లు అంతా జైలుకు వెళ్లారని.. పోలీసుల పరిస్థితి అంతే అని చంద్రబాబు అన్నారు. ఏదో మీరు బెదిరిస్తే భయపడిపోయే పార్టీ కాదని, 5 కోట్ల ప్రజల కోసం పోరాటమే కార్యకర్తలు, పార్టీ నాయకత్వం ఉందని, ఎవర్నీ వదిలిపెట్టే సమస్యే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు అండగా ఉంటామని తెలిపారు. చిన్నా ఇంటిపై రౌడీలు దాడి చేయడం దారుణమన్నారు. దొంగదెబ్బ తీయవద్దని, పోలీసులను వదిలిపెట్టి రండి అంటూ.. మీ సైకోను కూడా రమ్మనండి అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated at - 2023-02-24T23:16:52+05:30