TS News: భూపాలపల్లిలో కవిత పర్యటనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ యత్నం

ABN , First Publish Date - 2023-01-22T12:27:21+05:30 IST

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

TS News: భూపాలపల్లిలో కవిత పర్యటనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ యత్నం

జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత భూపాలపల్లి పర్యటనను అడ్డుకునేందుకు యూత్ కాంగ్రెస్ యత్నించింది. ఈ క్రమంలో గొర్లవీడు చౌరాస్తా వద్ద యూత్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. బొగ్గు గనుల్లో కార్మికులు చనిపోతే పరామర్శకు రాని కవిత, యూనియన్ ఆఫీస్ ఓపెనింగ్‌కు ఎందుకు వస్తున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

Updated Date - 2023-01-22T12:27:23+05:30 IST