Traffic Alert: ఆదివారం నుంచి హైదరాబాద్-విజయవాడ హైవేపై జర్నీ చేసేవాళ్లకు అలర్ట్ !

ABN , First Publish Date - 2023-02-04T15:18:35+05:30 IST

పెద్దగట్టు జాతర సందర్భంగా ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా సూర్యాపేట జిల్లా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్‌ డైవర్షన్‌ మ్యాప్‌ (Traffic diversion) ను

Traffic Alert: ఆదివారం నుంచి హైదరాబాద్-విజయవాడ హైవేపై జర్నీ చేసేవాళ్లకు అలర్ట్ !
హైవేపై జర్నీ చేసేవాళ్లకు అలర్ట్ !

తెలంగాణ రాష్ట్రం (Telangana) లో రెండో అతిపెద్ద జాతర సూర్యాపేట (Suryapet) జిల్లా పెద్దగట్టు (Peddagattu Jatara)లో ఫిబ్రవరి (ఆదివారం) 5 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనుండటంతో ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. పెద్దగట్టు జాతర సందర్భంగా ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా సూర్యాపేట జిల్లా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్‌ డైవర్షన్‌ మ్యాప్‌ (Traffic diversion) ను జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ విడుదల చేశారు.

365వ జాతీయ రహదారి మీదుగా ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా

  • హైదరాబాద్‌ నుంచి విజయవాడ (Hyderabad-Vijayawada)కు 65వ జాతీయ రహదారిపై నుంచి వెళ్లే వాహనాలను టేకుమట్ల వద్ద ఖమ్మం (Khammam) వైపునకు వెళ్లే 365 బీబీ జాతీయరహదారి (365 BB National Highway) మీదుగా మళ్లించనున్నారు. ఈ రహదారిపై రాఘవాపురం స్టేజీ వద్దకు వెళ్లి నామవరం గ్రామం మీదుగా తిరిగి గుంజలూరు స్టేజీ వద్ద 65వ జాతీయ రహదారిపైకి విజయవాడకు వెళ్లే వాహనాలు చేరుకుంటాయి.

  • విజయవాడ నుంచి సూర్యాపేట మీదుగా హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలను 65వ జాతీయ రహదారిపై స్వామినారాయణ గురుకుల పాఠశాల ఎదురుగా ఉన్న ఎస్సారెస్పీ కాల్వకట్ట మీదుగా 365బీబీ ఖమ్మం జాతీయరహదారిపైకి రోళ్లబండతండ వద్ద మళ్లిస్తారు. ఇక్కడి నుంచి వాహనాలు రాయినిగూడెం వద్దకు చేరుకొని హైదరాబాద్‌ వైపునకు వెళ్తాయి.

పార్కింగ్‌ స్థలాలు సిద్ధం

జాతరకు వాహనాల్లో వచ్చే భక్తుల కోసం పోలీసులు ప్రత్యేక పార్కింగ్‌ స్థలాల (Parking)ను కేటాయించారు. అవి ఇలా ఉన్నాయి.

సూర్యాపేట మీదుగా జాతరకు వచ్చే వాహనాలు : సూర్యాపేట మీదుగా పెద్దగట్టు జాతరకు వచ్చే భక్తుల వాహనాలు 65వ జాతీయ రహదారిపై ఉన్న హెచ్‌పీ పెట్రోల్‌బంక్‌ నుంచి రామకోటి తండాకు వెళ్లే మార్గంలో పార్కింగ్‌ చేయాల్సి.

గరిడేపల్లి నుంచి వచ్చే వాహనాలు : గరిడేపల్లి, పెన్‌పహాడ్‌ నుంచి దురాజ్‌పల్లికి వచ్చే భక్తుల వాహనాలను కలెక్టరేట్‌ కార్యాలయం వెనుక కేటాయించిన స్థలంలో పార్కింగ్‌ చేయాల్సి.

కోదాడ నుంచి వచ్చే వాహనాలు : కోదాడ, మునగాల, గుంపుల నుంచి దురాజ్‌పల్లి జాతరకు వచ్చే భక్తుల వాహనాలను కాశీంపేట గ్రామానికి వెళ్లే మార్గంలో కేటాయించిన స్థలంలో పార్కింగ్‌ చేయాలి.

మోతె నుంచి వాహనాలు : మోతె, చివ్వెంల నుంచి పెద్దగట్టు జాతరకు వచ్చే భక్తుల వాహనాలను మున్యానాయక్‌తండ (పెద్దగట్టు) వెనుక పార్కింగ్‌కు స్థలం కేటాయించారు.

వీఐపీ వాహనాలు : దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతరకు వచ్చే వీఐపీ వాహనాలను పెద్దగట్టు తూర్పు మెట్లకు ఎదురుభాగంలో కేటాయించిన స్థలంలో పార్కింగ్‌ చేయాలి.

ఇది కూడా చదవండి: Car Smoke: కారులోంచి వచ్చే పొగ నీలి రంగులోకి మారితే అర్థమేంటి..? తెలుపు, నలుపు రంగుల్లో కనిపిస్తే..

జాతరకు పటిష్ఠ బందోబస్తు : ఎస్పీ

పెద్దగట్టు లింగమంతులస్వామి జాతరకు వచ్చే భక్తులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోకుండా పటిష్ఠ బందోబస్తు, ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు తీసుకున్నట్టు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జాతర రూట్‌ మ్యాప్‌ ప్లెక్సీని ఆవిష్కరించి మాట్లాడారు. 1850 మంది పోలీసు సిబ్బంది, 500 మంది వాలంటీర్ల (volunteers)తో బందోబస్తు నిర్వహిస్తామన్నారు. ప్రతీ రోజు మూడు విడతల్లో 24 గంటల పాటు సిబ్బంది విధులు నిర్వహిస్తారన్నారు. సమావేశంలో డీఎస్పీలు నాగభూషణం, వెంకటేశ్వర్‌రెడ్డి, రవి, సీఐలు సోమనారాయణసింగ్‌, శ్రీనివాస్‌, నాగార్జున, ప్రసాద్‌, నర్సింహ, నాయడు, ఆర్‌ఐలు శ్రీనివా్‌సరావు, నర్సింహారావు, శ్రీనివాస్‌, ఎస్‌ఐలు విష్ణుమూర్తి, మధు, సాయిరాం, యాదవేందర్‌రెడ్డి, శ్రీకాంత్‌, సత్యనారాయణ, రవీందర్‌, హరికృష్ణ, వీరన్న, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-04T15:29:08+05:30 IST