CM KCR: మదన్‌రెడ్డి, సునీత లక్ష్మారెడ్డికి సీఎం కేసీఆర్ పిలుపు.. ఎందుకంటే..?

ABN , First Publish Date - 2023-09-30T22:23:42+05:30 IST

కొద్దిరోజులుగా బీఆర్ఎస్ పార్టీ(BRS Party) అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉన్న నేతలను సీఎం కేసీఆర్(CM KCR) ఏదో ఒక హామీని ఇస్తూ బుజ్జగిస్తున్నారు.

CM KCR: మదన్‌రెడ్డి, సునీత లక్ష్మారెడ్డికి సీఎం కేసీఆర్ పిలుపు.. ఎందుకంటే..?

హైదరాబాద్: కొద్దిరోజులుగా బీఆర్ఎస్ పార్టీ(BRS Party) అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉన్న నేతలను సీఎం కేసీఆర్(CM KCR) ఏదో ఒక హామీని ఇస్తూ బుజ్జగిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజీనామాలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మెదక్ ఉమ్మడి జిల్లా నర్సాపుర్ నియోజకవర్గం(Narsapur Constituency)లో MLA మదన్‌రెడ్డి(Madan ReddY), రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ సునీత లక్ష్మారెడ్డి (Sunitha Lakshmareddy) అధిష్ఠానంపై కినుక వహిస్తున్నారు. దీనికి తోడు ఆయా నేతల మధ్య కొంతకాలంగా వర్గపోరు నడుస్తోంది. ఈ విషయం కూడా అధిష్టానం దృష్టికి వచ్చింది. ఇద్దరి నేతల మధ్య సామరస్యత పెంచేందుకు గానూ సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌కు పిలిపించినట్లు సమాచారం.

ఆలస్యం అయితే ప్రమాదమని..

కొద్దిరోజుల క్రితం రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రకటించిన అసెంబ్లీ సీట్లలో నర్సాపూర్‌తో పాటు మరికొన్ని నియోజకవర్గాలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో పెండింగ్‌లో ఉన్న టికెట్లపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఆలస్యం అయితే అసలుకే నష్టం వస్తోందని భావించినా సీఎం కేసీఆర్ నర్సాపూర్ MLA మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ సునీత లక్ష్మారెడ్డికి ప్రగతిభవన్‌కు రావాలని పిలిచినట్లు విశ్వాసనీయ సమాచారం. మరికాసేపట్లో ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను మదన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి కలవనున్నారు. తనకు అసెంబ్లీ టికెట్ కేటాయించకపోవడంతో మదన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. సునీత లక్ష్మారెడ్డి కూడా అధిష్టానంపై కినుక వహిస్తోంది. ఈ సందర్భంలో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌కు ఇద్దరు నేతలను పిలవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అసంతృప్తితో ఉన్న నేతలను సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌కు పిలిపించుకుని ఆయా నేతల రాజకీయ భవిష్యత్తుపై భరోసా ఇస్తున్నారు.

Updated Date - 2023-09-30T22:35:51+05:30 IST