Share News

TS NEWS: ఆందోల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చోరీకి యత్నించిన బీఆర్ఎస్ కార్యకర్త

ABN , First Publish Date - 2023-12-04T22:08:52+05:30 IST

ఆందోల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ( Andol MLA camp office ) ఓ దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. కార్యాలయంలోని గ్రిజర్, సీలింగ్ ఫ్యాన్స్, మిగతా వస్తువులను బీఆర్ఎస్ ( BRS ) కార్యకర్త చోరీకి యత్నించాడు.

TS NEWS: ఆందోల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చోరీకి యత్నించిన బీఆర్ఎస్ కార్యకర్త

సంగారెడ్డి జిల్లా: ఆందోల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ( Andol MLA camp office ) ఓ దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. కార్యాలయంలోని గ్రిజర్, సీలింగ్ ఫ్యాన్స్, మిగతా వస్తువులను బీఆర్ఎస్ ( BRS ) కార్యకర్త చోరీకి యత్నించాడు. క్యాంప్ కార్యాలయంలో చోరీకి యత్నిస్తున్న దుండగుడిని పట్టుకొని స్థానికులు దేహశుద్ధి చేశారు. చోరీకి యత్నించిన దుండగుడు ఆందోల్ మండలంలోని పోతిరెడ్డి పల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తగా గుర్తించారు. దుండగుడిని జోగిపేట పోలీసులకు స్థానికులు అప్పగించారు.

Updated Date - 2023-12-04T22:09:03+05:30 IST