Share News

MLC Kavitha: రాహుల్.. ఎలక్షన్ గాంధీ

ABN , First Publish Date - 2023-10-21T16:16:58+05:30 IST

రాహుల్‌గాంధీపై (Rahul Gandhi) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘నువ్వు రాహుల్ గాంధీ కాదు.. ఎలక్షన్ గాంధీ. తెలంగాణ వాటాలపై పార్లమెంట్‌లో ఒక్కరోజైనా కొట్లాడారా?

MLC Kavitha: రాహుల్.. ఎలక్షన్ గాంధీ

జగిత్యాల: రాహుల్‌గాంధీపై (Rahul Gandhi) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘నువ్వు రాహుల్ గాంధీ కాదు.. ఎలక్షన్ గాంధీ. తెలంగాణ వాటాలపై పార్లమెంట్‌లో ఒక్కరోజైనా కొట్లాడారా?, పార్లమెంట్‌లో సోనియా గాంధీ ఆంధ్రా హక్కుల గురించే మాట్లాడారు . తెలంగాణ బిడ్డలను చంపింది కాంగ్రెస్సే. తెలంగాణ రాష్ట్రం ఏమైనా ఊరికే ఇచ్చారా?, ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకుంటేనే కదా.. మా బిడ్డలు చనిపోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎన్నికల కోసం ఇంతకు దిగజారుతారా?, బతుకమ్మ మీద మద్యం బాటిల్ పెడుతాము అంటారా?, మీ స్థాయికి ఇదేనా మాట్లాడేది.’’ అని కవిత తప్పుపట్టారు.

Updated Date - 2023-10-21T16:16:58+05:30 IST