YSRTP Chief: రేపు రాజ్‌భవన్‌కు వైఎస్ షర్మిల

ABN , First Publish Date - 2023-02-01T14:10:35+05:30 IST

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల రేపు (గురువారం) రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌తో షర్మిల భేటీకానున్నారు.

YSRTP Chief: రేపు రాజ్‌భవన్‌కు వైఎస్ షర్మిల

హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) రేపు (గురువారం) రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ (Governor Tamilisai Soundar Rajan) తో షర్మిల భేటీకానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) 9 ఏళ్ల పాలన వైఫల్యాలపై గవర్నర్‌కు వైఎస్సార్టీపీ అధినేత్రి వినతి పత్రం ఇవ్వనున్నారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం రాజ్‌భవన్ నుంచే నేరుగా షర్మిల పాదయాత్ర (YS Sharmila Padayatra)కు బయలుదేరి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర పునఃప్రారంభంకానున్నారు. ఆగిన చోట నుంచే ప్రజా ప్రస్థానం (Prajaprasthanam Padayatra) మొదలుకానుంది. నర్సంపేట నియోజక వర్గం చెన్నారావుపేట మండలం శంకరమ్మ తాండా నుంచి షర్మిల పాదయాత్రను మొదలుపెట్టనున్నారు.

కాగా.. షర్మిల పాదయాత్రకు వరంగల్ పోలీసులు (Warangal Police) షరతులతో కూడా అనుమతినిచ్చారు. జనవరి 28 నుంచి పాదయాత్రకు అనుమతివ్వాలని పోలీసులను వైఎస్సార్టీపీ కోరింది. అయితే ఫిబ్రవరి 2 నుంచి 18 వరకు పాదయాత్రకు అనుమతినిచ్చిన పోలీసులు దాదాపు 15 షరతులను విధించారు. రోజూ ఉదయం 10 గంటలకు నుంచి సాయంత్రం 7 గంటలకు పాదయాత్రను పూర్తి చేయాలని సూచించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మిగిలిపోయిన ఎనిమిది నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర కొనసాగనుంది. ప్రజాప్రస్థానం ముగింపు సభ పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్‌ మండలంలో జరగనుంది.

Updated Date - 2023-02-01T14:10:37+05:30 IST