Vijayashanti: దర్యాప్తు సంస్థల విచారణ అంటే బీఆర్ఎస్ నేతలకు భయమెందుకు?

ABN , First Publish Date - 2023-03-16T22:33:27+05:30 IST

బీఆర్ఎస్ నేతల(BRS leaders) అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ (Investigation by Central Investigative Agencies) అనగానే వారు వణికిపోతున్నారని బీజేపీ( BJP) సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు.

Vijayashanti: దర్యాప్తు సంస్థల విచారణ అంటే బీఆర్ఎస్ నేతలకు భయమెందుకు?

హైదరాబాద్ (Hyderabad): బీఆర్ఎస్ నేతల(BRS leaders) అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ (Investigation by Central Investigative Agencies) అనగానే వారు వణికిపోతున్నారని బీజేపీ( BJP) సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాములమ్మ సోషల్ మీడియా(Social media)లో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం సోషల్ మీడియాలో విజయశాంతి ఓ వార్త పోస్ట్ చేశారు. ఆ వార్తను యథతధంగా ఇస్తున్నాం. ‘‘ఈడీ విచారణ(ED investigation)లో వెలువడే నిర్ణయం బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే నిరసనలు, అల్లర్లు చేయడానికి సిద్ధపడి మందీ మార్బలంతో ఢిల్లీ(Delhi)లోని ఈడీ కార్యాలయాన్ని(ED office) చుట్టుముట్టారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. నిజంగా తప్పు చేయకుంటే విచారణ ఎదుర్కోవడానికి భయమెందుకు? మినహాయింపుల కోసం కోర్టుని ఆశ్రయించడమెందుకు? కేంద్రంలో ఒకప్పుడు చక్రం తిప్పిన పార్టీకి గతంలో అధినేత్రిగా ఉన్న జాతీయస్థాయి మహిళా నాయకురాలు సైతం ఇదే సంస్థ నుంచి విచారణను ఎదుర్కోగా లేంది... ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు ఎందుకీ ఉలికిపాటు? ఏకంగా ఈడీపైనే అభాండాలు మోపుతున్నారు. నీతిమంతులమని చెప్పుకుంటున్నవారు ఈడీకి వ్యతిరేకంగా తమ పిటిషన్ అత్యవసర విచారణ కోసం ఆత్రపడటం చూస్తుంటే... ఆ భయమేంటో తెలుస్తూనే ఉంది’’ అని విజయశాంతి ఎద్దేవా చేశారు.

Updated Date - 2023-03-16T22:34:48+05:30 IST