Traffice Police Vs Biker: ఇంటర్వ్యూకి వెళ్తుండగా యువకుడి బైక్ పట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు.. చాకచక్యంగా ఎలా బయపడ్డాడంటే..!
ABN , First Publish Date - 2023-06-10T21:17:18+05:30 IST
నగరంలో ట్రాఫిక్ సమస్య గురించి మనకు తెలియంది కాదు. అత్యవసర పరిస్థితుల్లో వెళ్తున్నపుడు నగరంలో ట్రాఫిక్ ఇబ్బంది పెడుతుంటుంది. మరోవైపు వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల నుంచి ఇబ్బందులు తప్పడంలేదు. ఇలాంటిదే మాదాపూర్‌లో ఓ యువకుడికి ఎదురైంది. ఇంటర్వ్యూకు వెళ్తుండగా ట్రాఫిక్ పోలీస్ పట్టుకోవడంతో ఆందోళనకు చెందాడు. అయితే చాకచక్యంగా వ్యవహరించి సమస్య నుంచి బయటపడి ఇంటర్వ్యూకు వెళ్లాడు.
హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ సమస్య గురించి మనకు తెలియంది కాదు. అత్యవసర పరిస్థితుల్లో వెళ్తున్నపుడు నగరంలో ట్రాఫిక్ ఇబ్బంది పెడుతుంటుంది. మరోవైపు వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల నుంచి ఇబ్బందులు తప్పడంలేదు. ఇలాంటిదే మాదాపూర్(Madapur)లో ఓ యువకుడికి ఎదురైంది. ఇంటర్వ్యూ(Interview)కు వెళ్తుండగా ట్రాఫిక్ పోలీస్(Traffic Police) పట్టుకోవడంతో ఆందోళనకు చెందాడు. అయితే చాకచక్యంగా వ్యవహరించి సమస్య నుంచి బయటపడి ఇంటర్వ్యూకు వెళ్లాడు. మాదాపూర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
ఓ యువకుడు ఇంటర్వ్యూకు వెళ్తుండగా..మాదాపూర్ ట్రాఫిక్ ఎస్ఐ(Madapur SI) అతని బైక్‌ను పట్టుకున్నాడు. ‘‘ఇంటర్వ్యూ ఉంది..వదిలేయండి..సాయంత్రం వచ్చి చలాన్ కడతాను’’ అని ఆ యువకుడు బతిమలాడిన వదలకపోవడంతో విషయాన్ని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ట్విట్టర్ @CYBTRAFFIC @cyberabadpoliceకు ట్యాగ్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
ఈ విషయంపై వెంటనే స్పందించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారులు..‘మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం..నెంబర్ షేర్ చేయండి.. మా అధికారులు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. వివాదంపై విచారిస్తారు.’’ అని రిప్లై ఇచ్చారు. అయితే కేవలం ఐదు నిమిషాల్లో సైబరాబాద్ పోలీసులు సమస్యను పరిష్కరించారు. దీనికి సంబంధించి ‘‘ సమస్య క్లియర్ అయింది. నా బైక్‌ను వదిలారు. నేను ఇంటర్వ్యూకు వెళ్తున్నా. చలాన్ డ్యూస్ సాయంత్రం వరకు పే చేస్తాను’’ అని బైకర్ మరో ట్వీట్ చేశాడు.
ఈ వివాదంపై స్పందించిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు బైకర్ తీరుపై అసహనం చేస్తే.. మరికొందరు ఎస్‌ఐ తీరుపై సెటైర్లు వేశారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘అతని డ్యూటీ అతను చేశాడు..అన్ని డాక్యుమెంట్లు పెట్టుకొని ప్రయాణించొచ్చు కదా..’’అని బైకర్ ప్రశ్నించాడు. ‘‘ట్రాఫిక్ పోలీసులను అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఇది సిగ్గుచేటు విషయం. ఈ దేశానికి పోలీసు సంస్కరణలు తప్పనిసరి. తీవ్రమైన నేరం కాదు. పౌరులను పోలీసులు అత్యంత గౌరవంగా చూడాలి.’’ మరో నెటిజన్ పోస్ట్ చేశాడు.
ట్రాఫిక్ పోలీసులు చలాన్లు పేరుతో డబ్బులు వసూలు చేయడం తప్పా.. ట్రాఫిక్ కంట్రోల్ చేయడం లేదని మరో నెటిజన్ రాశాడు.‘‘ఇలాంటి సంఘటనలు ఎయిర్‌పోర్ట్ ఏరియాలో కూడా జరుగుతున్నాయి.. ట్రాఫిక్ పోలీసులు ఆపడంతో ఫ్లైట్ మిస్సయిన సందర్భాలు చాలా ఉన్నాయి.’’ అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. ‘‘మీరు సరైన టైంకు ఇంటర్వ్యూలో అటెండ్ కాకపోతే..మీకు ఉద్యోగం రాకపోతే.. రేపటి నుంచి ఈ ట్రాఫిక్ ఉద్యోగి ఇంట్లోనే ఉండండి. అపుడు గాని బుద్ధి రాదు.’’అంటూ సెటైర్లు వేశాడు.
ఇంకో నెటిజన్ స్పందిస్తూ..‘‘ఇంతకీ ఇంటర్వ్యూ ఏమైంది’’అని అడిగాడు. దీనిపై స్పందిస్తూ ‘‘ఇంటర్వ్యూ పీకింది.. వచ్చేవారం రమ్మని హెచ్ఆర్ చెప్పింది..ఆరోజు కూడా ఉంటుందో లేదో.. చలాన్ డ్యూస్ సాలరీ వచ్చాక పే చేస్తా’’..అని బైకర్ రీట్వీట్ చేశాడు.