TS.Govt: సుప్రీంలో గవర్నర్ కేసును ప్రస్తావించని టీ.సర్కార్... కారణమిదే

ABN , First Publish Date - 2023-03-03T14:50:29+05:30 IST

తెలంగాణ గవర్నర్ తమిళిసైపై వేసిన కేసును ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రస్తావించలేదు.

TS.Govt: సుప్రీంలో గవర్నర్ కేసును ప్రస్తావించని టీ.సర్కార్... కారణమిదే

న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్ తమిళిసై (Telangana Governor Tamilisi)పై వేసిన కేసును ప్రభుత్వం (Telangana Government) సుప్రీంకోర్టు (Supreme court)లో ప్రస్తావించలేదు. హోలీ సెలవుల తరువాతే సుప్రీంలో గవర్నర్‌పై తెలంగాణా ప్రభుత్వ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లులకు గవర్నర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారంటూ గవర్నర్‌పై తెలంగాణ ప్రభుత్వం గురువారం సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్‌ను ఈరోజు సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ ప్రస్తావనకు తీసుకురాలేదు. రిజిస్ట్రీ అనుమతించిన తేదీనే విచారణకు వస్తుందనే ప్రస్తావించలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కాగా... రేపటి నుండి సుప్రీంకోర్టుకు హోలీ సెలవులు ఉన్నాయి. హోలీ సెలవుల తరువాతే తిరిగి సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. ఈ కారణంగా మరో వారం రోజుల తరువాతే తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.

కాగా... గవర్నర్‌ తమిళిసై తీరుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లులకు గవర్నర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారంటూ గురువారం పిటిషన్‌ దాఖలు చేసింది. ఇప్పటి వరకూ పది బిల్లులు పెండింగ్‌లో పెట్టారని, గత ఏడాది సెప్టెంబరు నుంచి ఏడు బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. ఇటీవలి బడ్జెట్‌ సమావేశాల తర్వాత పంపించిన మూడు బిల్లులకు కూడా గవర్నర్‌ ఆమోదం తెలపలేదని పిటిషన్‌లో పేర్కొంది. తన పిటిషన్‌లో ప్రతివాదులుగా గవర్నర్‌ కార్యదర్శిని చేర్చింది. శాసనసభ ఆమోదించిన అనేక బిల్లులకు ఆమోద ముద్ర వేయకపోవడంతో తరచూ రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడుతోందని, అందుకే ఆర్టికల్‌ 32 కింద సుప్రీం కోర్టు తన న్యాయ పరిధిని ఉపయోగించాలంటూ న్యాయస్థానం తలుపు తట్టక తప్పలేదని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌లో వెల్లడించింది.

Updated Date - 2023-03-03T14:50:29+05:30 IST