TS Assemblyలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న మంత్రి హరీష్

ABN , First Publish Date - 2023-02-06T10:40:29+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి.

TS Assemblyలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న మంత్రి హరీష్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session) సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు 2023- 24 గాను బడ్జెట్‌ (Budget 2023- 24)ను అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు. నాలుగవ సారి మంత్రి హరీష్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. తెలంగాణ ఆచరిస్తోంది... దేశం అనుసరిస్తోంది అంటూ మంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని మొదలు పెట్టారు. మొత్తం రూ.2,90,396 కోట్లతో బడ్జెట్‌‌ను రూపొందించారు. ప్రగతిశీల రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు. దేశానికి తెలంగాణ మోడల్‌గా నిలిచిందని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. ప్రస్తుతం బడ్జెట్ ప్రసంగం కొనసాగుతోంది. అటు మండలిలో శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashanth Reddy) బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

అంతుకుముందు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Speaker Pocharam Srinivas Reddy) ని ఆయన ఛాంబర్‌లో మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతులను స్పీకర్‌కు అందజేశారు. అటు మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్‌ని కూడా మంత్రులు కలిసి బడ్జెట్ ప్రతులను అందజేశారు. మంత్రులు స్పెషల్ సీఎస్ రామకృష్ణ రావు ఉన్నారు.

మీడియాతో హరీష్....

శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు మంత్రి హరీష్ రావు (Telangana Minister Harish Rao) మీడియాతో మాట్లాడుతూ... బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు. బడ్జెట్‌లో అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఉంటుందన్నారు. కేంద్రం సహకరించక పోయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా బడ్జెట్‌ను రూపొందించామని చెప్పుకొచ్చారు. తెలంగాణ బడ్జెట్ దేశానికి మోడల్‌గా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు.

Updated Date - 2023-02-06T10:57:42+05:30 IST