YSRTP Chief: ఢిల్లీలో వైఎస్ షర్మిల అరెస్ట్.. ఎందుకంటే...

ABN , First Publish Date - 2023-03-14T14:51:08+05:30 IST

వైఎస్సార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఢిల్లీలో అరెస్ట్ అయ్యారు.

YSRTP Chief: ఢిల్లీలో వైఎస్ షర్మిల అరెస్ట్.. ఎందుకంటే...

న్యూఢిల్లీ: వైఎస్సార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP YS Sharmila) ఢిల్లీలో అరెస్ట్ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM KCR) అవినీతి పాలనపై మంగళవారం షర్మిల (Sharmila), వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు పార్లమెంట్‌మార్చ్ చేపట్టారు. కాగా.. షర్మిల పార్లమెంట్ మార్చ్‌ (Parliament March)ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్టీపీ శ్రేణులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై జేపీసీ వేయాలని, కేంద్ర దర్యాప్తు సంస్థలచే విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు. వెంటనే షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం (Telangana State) లో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)లో భారీగా అవినీతి జరిగిందని... దానిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలో అతిపెద్ద స్కామన్నారు. దేశప్రజల సొమ్ము లక్షకోట్ల కేసీఆర్ (KCR) దోచుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM) ఈ అవినీతికి పాల్పడ్డారని అన్నారు. కమిషన్ల కోసం రీడిజైన్ పేరుతో భారీ అవినీతి జరిగిందని వ్యాఖ్యలు చేశారు. 38 వేల కోట్ల ప్రాజెక్టును లక్షా 50 వేల కోట్లకు పెంచారన్నారు. మూడు సార్లు ప్రాజెక్టు నిర్మాణ వేయం పెంచారని తెలిపారు. ప్రాజెక్టు వల్ల చాలా మంది నిరాశ్రయులు అయ్యారని.. వారికి న్యాయం చెయ్యలేదని మండిపడ్డారు. నాణ్యత లేకుండా ప్రాజెక్టు కట్టారన్నారు. ప్రతి ఏటా వేల వేకరాలు ముంపుకు గురి అవుతాయన్నారు. ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగింది సీబీఐ, ఈడీలతో విచారణ జరపాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

Updated Date - 2023-03-14T15:03:38+05:30 IST