R. S. Praveen Kumar: మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి

ABN , First Publish Date - 2023-09-19T17:15:33+05:30 IST

మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్(R. S. Praveen Kumar) వ్యాఖ్యానించారు.

R. S. Praveen Kumar:  మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి

హైదరాబాద్: మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్(R. S. Praveen Kumar) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు బీఎస్సీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ మహిళ రిజర్వేషన్లను(Women's reservation) కులాల వారీగా కేటాయించాలి. చట్టసభల్లో మహిళా బిల్లును స్వాగతిస్తున్నాం.మహిళ రిజర్వేషన్లను కులాల వారీగా కేటాయించాలి. బీహార్‌ రాష్ట్రంలో గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్‌గా ఉన్న ఐ.ఏ.ఎస్ అధికారి జి.కృష్ణయ్య ను హత్య చేసిన గ్యాంగ్‌స్టర్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌ను ఎందుకు విడుదల చేశారు? ఆనంద్ మోహన్ విడుదలపై 'ఇండియా' కూటమిలో ఉన్న నితీష్ కుమార్, ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే సమాధానం చెప్పాలి. చట్టసభల్లో మహిళా బిల్లు కోసం కవిత ధర్నా చేసింది ఈడీ కేసులు తప్పించుకోవడం కోసమే. తెలంగాణ బీఅర్ఎస్ పార్టీలో మహిళలకు రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడంలేదు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు న్యాయం జరుగదు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు కేవలం ముగ్గురు మాత్రమే, వారు కూడా అధిపత్య కులాల వారే.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తొలుత కేసీఆర్‌ను ఒప్పించి, బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు 33% అసెంబ్లీ స్థానాలు కేటాయించాలి.

డీఎస్సీ పోస్టులను పెంచాలి. డీఎస్సీ పరీక్షను 6 నెలలు వాయిదా వేయాలి అన్ని విశ్వవిద్యాలయాల్లో పనిచేసే పార్ట్ టైం అధ్యాపకులను రెగ్యులర్ చేయాలి’’ అని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-09-19T17:15:33+05:30 IST