Pawan Kalyan: స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదం..మానవ తప్పిదమా? అజాగ్రత్త వల్లా..?

ABN , First Publish Date - 2023-03-17T12:37:05+05:30 IST

పాతికేళ్లు నిడకుండానే ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Janasena chief Pawan Kalyan) తీవ్ర ఆవేదన

Pawan Kalyan: స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదం..మానవ తప్పిదమా? అజాగ్రత్త వల్లా..?

హైదరాబాద్: పాతికేళ్లు నిడకుండానే ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Janasena chief Pawan Kalyan) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని పవన్ సూచించారు. సికింద్రాబాద్‎లోని స్వప్న లోక్ కాంప్లెక్స్‎లో(Swapna Lok Complex) గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో పాతికేళ్లు కూడా నిండని నలుగురు యువతులు, ఇద్దరు యువకులు మృతి చెందటం చాలా బాధాకరమైన విషయం ఇది. ఉద్యోగం కోసం పొట్ట చేతి పట్టుకొని రాజధానికి వచ్చిన బిడ్డలు ఈ ప్రమాదంలో అశువులు బాయడం చాలా బాధించిందన్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో కూలంకషంగా, శాస్త్రీయంగా దర్యాప్తు చేపట్టాలన్నారు. ఈ ఘటన మానవ తప్పిదమా? అజాగ్రత్త వల్లా? భవన నిర్మాణ సమయంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడమా అనేది తెలియవలసి ఉందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పవన్ కోరారు.

Updated Date - 2023-03-17T12:37:05+05:30 IST