MLC Kavitha: హైదరాబాద్ బిర్యానీ తినండి కానీ.. ప్రజలను మభ్యపెట్టొద్దు

ABN , First Publish Date - 2023-09-15T21:53:58+05:30 IST

కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్‌, కేసీ వేణుగోపాల్‌(Jairam Ramesh and KC Venugopal) వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) స్పందించారు.

MLC Kavitha: హైదరాబాద్ బిర్యానీ తినండి కానీ.. ప్రజలను మభ్యపెట్టొద్దు

హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్‌, కేసీ వేణుగోపాల్‌(Jairam Ramesh and KC Venugopal) వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై జైరాం రమేశ్‌, కేసీ వేణుగోపాల్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఆరోపణలపై కవిత కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం నాడు బీఆర్ఎస్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేషనల్ హెరాల్డ్‌ కేసులో ఈడీ కేసు విచారణ ఏమైంది? సోనియా, రాహుల్‌పై ఈడీ కేసులు ఏడాదిగా ఎందుకు ముందుకు కదలడం లేదు? బీజేపీతో అవగాహన కుదిరినందుకే కాంగ్రెస్‌ నేతలను ఈడీ విచారణకు పిలవడం లేదా?బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య అవగాహన ఏంటో బయటపెట్టాలి.కాంగ్రెస్‌ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానంతో బహుళ వైఖరి అవలంభిస్తోంది.కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అదానీకి రెడ్‌ కార్పెట్‌ వేస్తూ ఇతర రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తున్నారు.కాంగ్రెస్‌ ద్వంద్వ, మోసపూరిత వైఖరి ప్రజలకు అర్థమైంది.20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మహిళా బిల్లుపై సోనియా, రాహుల్‌ ఎందుకు మాట్లాడట్లేదు?.సీడబ్ల్యూసీ సమావేశాలకు వస్తున్న రాజకీయా టూరిస్టులకు స్వాగతం. హైదరాబాద్ బిర్యానీ తిని సంతోషంగా వెళ్లండి కానీ.. ప్రజలను మభ్యపెట్టవద్దు’’ అని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవ చేశారు.

Updated Date - 2023-09-15T21:53:58+05:30 IST