Share News

BRS MLA : లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

ABN , Publish Date - Dec 24 , 2023 | 03:03 PM

నగరంలోని న్యూ బోయినపల్లి ( New Boinapally ) లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి‌లో ఉన్న లిఫ్ట్‌లో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ( BRS ) ఎమ్మెల్యే లాస్య నందిత ( MLA Lasya Nandita ) ఇరుక్కుపోయారు. ఆదివారం (ఈరోజు) ఆస్పత్రి‌ వార్షికోత్సవానికి ఎమ్మెల్యే లాస్య నందిత హాజరయ్యారు. ఆస్పత్రి మూడో అంతస్తుకు వెళ్లేందుకు ఎమ్మెల్యే లిఫ్ట్ ఎక్కారు. ఆమెతో పాటు పరిమితికి మించి లిఫ్ట్‌లో ఎక్కారు.

BRS MLA : లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బీఆర్ఎస్  ఎమ్మెల్యే

హైదరాబాద్: నగరంలోని న్యూ బోయినపల్లి ( New Boinapally ) లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి‌లో ఉన్న లిఫ్ట్‌లో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ( BRS ) ఎమ్మెల్యే లాస్య నందిత ( MLA Lasya Nandita ) ఇరుక్కుపోయారు. ఆదివారం (ఈరోజు) ఆస్పత్రి‌ వార్షికోత్సవానికి ఎమ్మెల్యే లాస్య నందిత హాజరయ్యారు. ఆస్పత్రి మూడో అంతస్తుకు వెళ్లేందుకు ఎమ్మెల్యే లిఫ్ట్ ఎక్కారు. ఆమెతో పాటు పరిమితికి మించి లిఫ్ట్‌లో ఎక్కారు. దీంతో లిఫ్ట్‌లో సాంకేతిక లోపంతో లిఫ్ట్ డోర్ మూసుకుపోయింది. అనంతరం సెల్లార్‌లోకి లిఫ్ట్ వెళ్లిపోయింది. దీంతో పదిహేను నిమిషాలపాటు లిఫ్ట్‌లో ఎమ్మెల్యే ఇరుక్కుపోయారు. కాసేపు ఆస్పత్రిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. లిఫ్ట్ డోర్లు పగులగొట్టి ఎమ్మెల్యేను ఆస్పత్రి సిబ్బంది బయటకు తీశారు.ఎవరికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - Dec 24 , 2023 | 03:03 PM