Minister KTR: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర...

ABN , First Publish Date - 2023-04-11T13:06:06+05:30 IST

హైదరాబాద్: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ (Visakha Steel Privatization)కు కేంద్రం (Central) కుట్ర చేస్తోందని మంత్రి కేటీఆర్ (Minister KTR) విమర్శించారు.

Minister KTR: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర...

హైదరాబాద్: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ (Visakha Steel Privatization)కు కేంద్రం (Central) కుట్ర చేస్తోందని మంత్రి కేటీఆర్ (Minister KTR) విమర్శించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను (Public Sector Organizations) కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తే ఉద్యోగులు నష్టపోతారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt.) పెద్దపీట వేసిందని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో.. బీహెచ్ఇఎల్ (BHEL)కు నేరుగా అధిక ఆర్డర్లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ (Telangana) అని మంత్రి పేర్కొన్నారు. బీమా పథకాలన్నీ ఎల్ఐసీ (LIC)కి అప్పగించారని, నష్టాలను ప్రజలకు.. లాభాలను నచ్చినవారికి అప్పగించడం.. కేంద్రం ఆలోచనగా కనిపిస్తోందని మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

ఎస్ఏఐఎల్ (SAIL) ద్వారా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ (Steel Factory) పరిశీలిస్తామని విభజన చట్టంలో కేంద్రం స్పష్టంగా చెప్పిందని మంత్రి కేటీఆర్ అన్నారు. బయ్యారం (Bayyaram), కడప (Kadapa)లో స్టీల్ ఫ్యాక్టరీలు (Steel Factories) ఏర్పాటు చేస్తామని.. కేంద్రం హామీ ఇచ్చిన విషయాన్ని మంత్రి ఈ సందర్బంగా గుర్తు చేశారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi)ని ఎన్నోసార్లు కలిశానని, బైలాదిల్లా నుంచి బయ్యారానికి.. 50 శాతం పైప్‌లైన్ ఖర్చు భరిస్తామని చెప్పామని అన్నారు. 2014 నుంచి బయ్యారం గురించి ప్రశ్నిస్తున్నామని, కేంద్ర మంత్రులను కలిసినా ఎలాంటి లాభం లేదని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

బయ్యారం వెనుక ఉన్న కుట్రను గుర్తించలేకపోయామని, 2018 సెప్టెంబర్‌లో అదానీ గ్రూప్ (Adani Group) బైలదిల్లా ఐరన్‌ ఓర్ కంపెనీ పెట్టిందని మంత్రి కేటీఆర్ అన్నారు. బైలదిల్లా నుంచి ఐరన్ ఓర్‌ను.. గుజరాత్‌లో (Gujarath)ని ముంద్రా (Mundra)కు తరలించేలా ప్రణాళిక చేశారని మంత్రి ఆరోపించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కావాలనే నష్టాల్లోకి నెట్టారని, అదానీ కోసమే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. బైలదిల్లా గనులపై అదానీ, కేంద్ర పెద్దల కన్ను పడిందని, నష్టాలను చూపించి దోస్తులకు చౌకగా విక్రయించడం ప్రధాని మోదీ విధానమని అన్నారు. తెలుగు రాష్ట్రాలపై మోదీ చేస్తున్న కుట్రను.. ఎండగట్టేందుకు బీఆర్ఎస్ (BRS) కృషి చేస్తోందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-04-11T13:06:06+05:30 IST