Manda Krishna Madiga: కేంద్రం ఎస్సీ వర్గీకరణను నిర్లక్ష్యం చేస్తోంది

ABN , First Publish Date - 2023-09-25T17:19:40+05:30 IST

ఎస్సీ వర్గీకరణ(SC Classification)కు ప్రధాన దోషి బీజేపీ(BJP)నేనని ..పార్లమెంట్‌ సమావేశాలల్లో బిల్లు ఎందుకు పెట్టలేదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడ మంద కృష్ణ మాదిగ(Manda Krishna Madiga) కేంద్ర ప్రభుత్వాన్ని(Central Govt) ప్రశ్నించారు.

Manda Krishna Madiga: కేంద్రం ఎస్సీ వర్గీకరణను నిర్లక్ష్యం చేస్తోంది

ఢిల్లీ: ఎస్సీ వర్గీకరణ(SC Classification)కు ప్రధాన దోషి బీజేపీ(BJP)నేనని ..పార్లమెంట్‌ సమావేశాలల్లో బిల్లు ఎందుకు పెట్టలేదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడ మంద కృష్ణ మాదిగ(Manda Krishna Madiga) కేంద్ర ప్రభుత్వాన్ని(Central Govt) ప్రశ్నించారు. సోమవారం నాడు ఢిల్లీలోని ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్రం బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. బీజేపీకి మా ఓట్లు అడిగే హక్కు లేదు. అక్టోబర్ నాలుగు నుంచి అల్లంపూర్ నుంచి పాదయాత్ర చేస్తాం. ఏపీలో కూడా భారీ బహిరంగ సభలు పెడతాం. మాదిగాల విశ్వరూపం పేరిట పాదయాత్ర చేస్తా. ఎస్సీ వర్గీకరణ జరగాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ మద్దతు తెలిపింది. గతంలో తిరుపతిలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని తీర్మానం చేశారు. విభజన అనంతరం కూడా 2014 ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరంగల్ సభలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని నాతో స్వయంగా అన్నారు. ఆ సభలో ఉన్న కిషన్‌రెడ్డి ఇందుకు సాక్ష్యం. కాదని కిషన్‌రెడ్డి(Kishan Reddy)ని చెప్పమనండి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు హోదాలో నితీన్ గడ్కరీ(Nitin Gadkari) కూడా ఎస్సీ వర్గీకరణకు హామీ ఇచ్చారు. మోదీ జూలై 8వ తేదీన వరంగల్ పర్యటనలో కిషన్‌రెడ్డి సాక్షిగా వర్గీకరణ చేస్తామని చెప్పారు.

పార్లమెంట్‌ సమావేశాలల్లో(Parliament Sessions) ఎస్సీ వర్గీకరణ చేస్తారని అనుకున్నాం. పార్లమెంట్ సమావేశాల ప్రతి సందర్భంలో మా ప్రయత్నం చేశాం. కేంద్రం ఎస్సీ వర్గీకరణకు నిర్లక్ష్యం చేసింది. కర్ణాటక ఎన్నికల సమయంలో రాష్ట్ర కేబీనెట్ తీర్మానం చేసి బీజేపీ కేంద్రానికి పంపింది. తీర్మానాలు చేస్తున్నారు.. హామీలు ఇస్తున్నారు....బిల్లు పెట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రధాన మంత్రి మోదీ బిల్లుల అంశంలో ఏ నిర్ణయం తీసుకుంటే ఎక్కడ ఆగడం లేదు. బీజేపీ 370, జీఎస్టీ, అగ్రకులల్లో వెనకబడిన కులాలకు బిల్లు తెచ్చారు. మహిళా బిల్లు తీసుకురావడం కూడా స్వాగతిస్తున్నాం. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో జస్టిస్ రామచంద్ర కమిషన్ వేస్తే దళితుల మధ్య అసమానతలు ఉన్నాయని చెప్పింది. చంద్రబాబు నాయుడు 4 ఏళ్ల పాటు రిజర్వేషన్ కల్పించారు.

అన్ని కమిషన్లు వర్గీకరణ సమంజసం అని రిపోర్ట్ ఇచ్చింది. 50 ఏళ్ల క్రితమే దళితుల మధ్య అసమానతలు ఉన్నాయని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణకు మద్దతు తెలిపాయి. దళితుల్లో విద్య ,ఉద్యోగ అవకాశాల్లో మాదిగలు చివరి స్థానంలో ఉన్నారు. బీజేపీ పండిట్ దీన్ దయాళ్ స్ఫూర్తిని పక్కన పెట్టినట్టేనా..? సామాజిక న్యాయమని అంటున్నారు. కేంద్రం ఆలస్యం చేస్తే, న్యాయ వ్యవస్థ న్యాయం చేయడానికి ముందుకు రావాలి కాబట్టి కోర్టుకు వెళ్లాం. సుప్రీంకోర్టులో ఎప్పుడో పిటిషన్ వేశాం. ఇప్పటి వరకు విచారణకు రాలేదు. సీజేఐ ముందు ముకుల్ రోహత్గి మెన్షన్ చేశారు. తెలంగాణ ఎన్నికల ముందే హైదరాబాద్‌లో లక్షలాది మందితో సమావేశం ఏర్పాటు చేస్తాం’’ అని మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-25T17:19:40+05:30 IST