Mallikarjuna Kharge : ప్రతిపక్షాలపై బీజేపీ ప్రతీకార చర్యకు పూనుకుంది

ABN , First Publish Date - 2023-09-16T18:05:14+05:30 IST

మణిపూర్‌(Manipur)లో శాంతి స్థాపించడంలో మోదీ ప్రభుత్వం(Modi Govt) విఫలమైందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) వ్యాఖ్యానించారు. శనివారం నాడు CWC సమావేశాలు ప్రారంభమయ్యాయి.

Mallikarjuna Kharge : ప్రతిపక్షాలపై బీజేపీ ప్రతీకార చర్యకు పూనుకుంది

హైదరాబాద్: మణిపూర్‌(Manipur)లో శాంతి స్థాపించడంలో మోదీ ప్రభుత్వం(Modi Govt) విఫలమైందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) వ్యాఖ్యానించారు. శనివారం నాడు CWC సమావేశాలు ప్రారంభమయ్యాయి. 5 రాష్ట్రాల ఎన్నికల వ్యూహంపై రేపు అంతర్గత సమావేశంలో చర్చిద్దామని ఖర్గే తెలిపారు.ఈ సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్(Congress) పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కీలక పాత్ర పోషిస్తోంది. మణిపూర్‌లో ఇప్పటికీ జరుగుతున్న విషాదకర సంఘటనలను దేశం మొత్తం చూస్తోంది. మోదీ ప్రభుత్వ పద్ధతులు లౌకిక భారతదేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి.మన ఆర్థిక వ్యవస్థ నేడు తీవ్ర ప్రమాదంలో ఉంది. దేశంలో నిరుద్యోగం రికార్డు స్థాయిలో ఉంది. జాతీయ భద్రత విషయంలో, చైనా ఆక్రమణల విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదు. ఆత్మనిర్భర్ భారత్, 5 ట్రిలియన్ ఎకానమీ, న్యూ ఇండియా 2022, అమృత్ కాల్ , 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వంటి నినాదాలు కేవలం ప్రభుత్వ వైఫల్యాల నుంచి దేశాన్ని మరల్చడానికి ఉద్దేశించిన బూటకపు పదాలు మాత్రమే.

భారత రాజ్యాంగాన్ని, దేశ ప్రజాస్వామ్యాన్ని, అట్టడుగు వర్గాల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. భారతదేశ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినందున, ప్రజల గొంతుకగా ఉండటం కాంగ్రెస్ బాధ్యత.ఈరోజు 27 భారత పార్టీలు ప్రాముఖ్యమైన ప్రాథమిక సమస్యలపై కలిసి ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలపై బీజేపీ ప్రతీకార చర్యకు పూనుకుంది.పార్లమెంట్‌లో ప్రతిపక్షాలను అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.త్వరలో జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అధికార పార్టీ ఉద్దేశాల గురించి ఆందోళన కలిగిస్తున్నాయి. రాబోయే శాసనసభ , లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన సంస్థాగత సమస్యలపై రేపటి సమావేశంలో వివరంగా మాట్లాడతా’’ అని మల్లికార్జన ఖర్గే పేర్కొన్నారు.

Updated Date - 2023-09-16T18:05:55+05:30 IST