Share News

Kunamneni Sambasiva Rao: కేటీఆర్ వ్యాఖ్యలు సరైనవి కావు

ABN , Publish Date - Dec 16 , 2023 | 03:29 PM

బీఆర్ఎస్, మజ్లిస్, బీజేపీ పార్టీలు కలిపి 54 మంది ఎమ్మెల్యేలం ఉన్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ( KTR )మాట్లాడుతున్నారని ఆ వ్యాఖ్యలు సరైనవి కావని.. ఇది మంచి పద్ధతి కాదని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ( Kunamneni Sambasiva Rao ) పేర్కొన్నారు.

Kunamneni Sambasiva Rao: కేటీఆర్ వ్యాఖ్యలు సరైనవి కావు

హైదరాబాద్: బీఆర్ఎస్, మజ్లిస్, బీజేపీ పార్టీలు కలిపి 54 మంది ఎమ్మెల్యేలం ఉన్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ( KTR )మాట్లాడుతున్నారని ఆ వ్యాఖ్యలు సరైనవి కావని.. ఇది మంచి పద్ధతి కాదని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ( Kunamneni Sambasiva Rao ) పేర్కొన్నారు. శనివారం నాడు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ...‘‘ అసెంబ్లీని ఎక్కువ రోజులు నడపాలి. ఈ సమావేశాలకు ప్రతిపక్షం సహకరించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా నిధులు రావాల్సి ఉంది. బీఆర్ఎస్ చేసిన తప్పులను చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్లాలి. ఈ ప్రభుత్వం ఎంత కాలం ఉంటుందో చూస్తామని బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు అనడం సరైంది కాదు. కొంత మంది ఎమ్మెల్యేలు అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు’’ అని కూనంనేని సాంబశివరావు తెలిపారు.


ఆ ఎమ్మెల్యేలు ఓడిపోయారు

‘‘పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం సరైంది కాదు. ఎమర్జెన్సీలో తప్పు చేస్తే ఇప్పుడు చేయాలా..? గత ప్రభుత్వం కోదండరాం, రేవంత్‌రెడ్డిని, కమ్యూనిస్టులను హౌస్ అరెస్టులు చేసింది. స్వేచ్ఛలేని జీవితాన్ని తెలంగాణ ప్రజలు అంగీకరించారు. స్వేచ్చ తెలంగాణ రావాలి. పథకాల అమలులో విఫలమైన.. ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. పంజరం నుంచి బయటకు వచ్చినట్లు ప్రజలు భావిస్తున్నారు. 26 ప్రజా సంఘాలను గత ప్రభుత్వం నిషేధించింది. గత ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమి, రెండు పడక గదుల ఇళ్ల, దళిత బంధు, బీసీ బంధును విస్మరించింది. ప్రతి నెల ఒకటో తేదీన ఎందుకు జీతాలు ఇవ్వలేదు. విద్యార్థులకు ఉపకార వేతనాలు ఎందుకు ఇవ్వలేదు.బీఆర్ఎస్ తప్పులు చేయడం వల్లే అధికారం కోల్పోయింది’’ అని కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.

ఆవిషయం మేము ఎక్కడా చెప్పలేదు: హరీశ్‌రావు

ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా చెప్పలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శనివారం నాడు అసెంబ్లీలో హరీశ్‌రావు మాట్లాడుతూ...‘‘ మా మేనిఫెస్టోలో ఎక్కడా ఈ అంశాన్ని పేర్కొనలేదు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని ఎక్కడ చెప్పామో చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హరీశ్‌రావు సవాల్ విసిరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Dec 16 , 2023 | 03:39 PM