నాటు నాటు సాంగ్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నా: కేటీఆర్

ABN , First Publish Date - 2023-03-13T10:54:49+05:30 IST

నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంపై తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.

నాటు నాటు సాంగ్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నా: కేటీఆర్

హైదరాబాద్ : నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంపై తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ సినిమా టీంపై సినీ, రాజకీయ ప్రముఖులు ట్విటర్ వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ సైతం తన సంతోషాన్ని ట్విటర్ వేదికగా వ్యక్తం చేశారు.

‘‘ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌ దక్కించుకున్న గౌరవాన్ని బిలియన్ భారతీయులతో కలిసి నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా. ఎంఎం కీరవాణి గారూ.. లిరిసిస్ట్ బోస్‌ గారు చరిత్ర సృష్టించారు. అద్భుతమైన స్టోరీ టెల్లర్, ది మ్యాన్ ఆఫ్ దిమూమెంట్ ఎస్ఎస్ రాజమౌళి గారూ భారతదేశం గర్వపడేలా చేశారు. ఇక సూపర్ స్టార్స్ అయిన నా సోదరులిద్దరూ ఎన్టీఆర్, రామ్ చరణ్ అదరగొట్టేశారు. నాటు నాటు సాంగ్‌కి సహకరించిన ప్రతి ఒక్కరికీ అభినందిస్తున్నా. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్ తదితరులందరికీ నమస్కారం. ఉత్తమ డాక్యుమెంటరీగా ఆస్కార్‌ను గెలుచుకుని.. అద్భుతమైన విజయం సాధించినందుకు ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ బృందానికి నా అభినందనలు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-03-13T10:54:49+05:30 IST