KTR: చంద్రబాబుకు వయస్సు అయిపోలేదు
ABN , First Publish Date - 2023-11-13T20:23:11+05:30 IST
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) కు వయస్సు అయిపోలేదని మంత్రి కేటీఆర్ ( KTR ) అన్నారు.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) కు వయస్సు అయిపోలేదని మంత్రి కేటీఆర్ ( KTR ) అన్నారు. సోమవారం నాడు ఏబీఎన్ ( ABN బిగ్ డిబేట్ )లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..‘‘చంద్రబాబుకు మోదీ కంటే చిన్న వయస్సు. చంద్రబాబుకు మరో పది పదిహేనేళ్లు రాజకీయం చేసే సత్తా ఉంది. శాంతిభద్రతల నేపథ్యంలోనే ఆందోళనల విషయంలో.. అది పక్క రాష్ట్రం వ్యవహారం అన్నా. చంద్రబాబు అరెస్ట్ విషయంలో నా వ్యాఖ్యలు తప్పుగా జనంలోకి వెళ్లాయి. చంద్రబాబు, లోకేశ్, జగన్, పవన్‌కల్యాణ్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటా.చంద్రబాబు విషయంలో లోకేశ్ ఆవేదనను అర్థం చేసుకున్నా. చంద్రబాబు, లోకేశ్ విషయంలో మాకు సోదరభావం ఉంది’’ అని కేటీఆర్ అన్నారు.