TS NEWS: యువతులను వేధిస్తున్న పోకిరికి దేహశుద్ది
ABN , Publish Date - Dec 26 , 2023 | 06:40 PM
నగరంలోని సూరారంలో యువతులను వాట్సప్ ఫోన్లలో వేధిస్తున్న పోకిరికి దేహశుద్ది చేశారు. నాని ఆలియాస్ సికిందర్(26) బీఎస్సీ చదివాడు.. కాని గంజాయికి బానిసై మహిళలను నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడు. యువతులను టార్గెట్‌గా చేసుకొని ఫోన్‌లో అశ్లీల మెసేజ్‌లతో వేధింపులకు గురిచేస్తున్నాడు.
హైదరాబాద్: నగరంలోని సూరారంలో యువతులను వాట్సప్ ఫోన్లలో వేధిస్తున్న పోకిరికి దేహశుద్ది చేశారు. నాని ఆలియాస్ సికిందర్(26) బీఎస్సీ చదివాడు.. కాని గంజాయికి బానిసై మహిళలను నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడు. యువతులను టార్గెట్‌గా చేసుకొని ఫోన్‌లో అశ్లీల మెసేజ్‌లతో వేధింపులకు గురిచేస్తున్నాడు. అతను డయోగ్నిక్ సెంటర్లో పనిచేస్తున్నాడు. అక్కడికి వచ్చే వారి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేస్తూ వేధించే ఆకతాయిని మహిళల బందువులు చితకబాదారు. సమాచారం అందుకున్న సూరారం పోలీసులు మహిళలు తీవ్రంగా కొట్టారు. గాయపడ్డ పోకిరిని స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.