Share News

Komatireddy Rajgopalreddy: తప్పు చేశా.. సరిదిద్దుకునేందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నా

ABN , First Publish Date - 2023-10-27T10:16:33+05:30 IST

మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. గత రాత్రి కాంగ్రెస్‌ నేత మాణిక్‌రావు ఠాక్రే సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. తిరిగి ఈరోజు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో మరోసారి పార్టీ కండువా కప్పుకున్నారు.ఇందులో భాగంగా కాసేపట్టి క్రితమే కోమటిరెడ్డి ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు.

Komatireddy Rajgopalreddy: తప్పు చేశా.. సరిదిద్దుకునేందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నా

న్యూఢిల్లీ: మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Former MLA Komatireddy Rajgopal Reddy) తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. గత రాత్రి కాంగ్రెస్‌ నేత మాణిక్‌రావు ఠాక్రే (Congress leader Manik Rao Thackeray) సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. తిరిగి ఈరోజు (శుక్రవారం) ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో (AICC President Mallikarjuna Kharge) మరోసారి పార్టీ కండువా కప్పుకున్నారు.ఇందులో భాగంగా కాసేపట్టి క్రితమే కోమటిరెడ్డి ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను తప్పు చేశా, సరిదిద్దుకునేందుకే తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్న. కేసీఆర్‌ను ఓడించడమే నా ఏకైక లక్ష్యం, బీజేపీలోకి వెళ్లిన, కాంగ్రెసులోచేరినా కేసీఆర్‌ను గద్దె దించేందుకే. కేసీఆర్ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకుంటుందనే ఆ పార్టీలో చేరా. చర్యలు లేనందునే బయటకు వచ్చా. బీజేపీలో నాకు గౌరవం, ప్రాధాన్యత ఇచ్చారు. కానీ నా లక్ష్యం నెరవేరలేదు. హంగ్ వస్తే బీజేపీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తారు. బీజేపీకి ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు ఓటు వేసినట్లే. ప్రజలు నేను కాంగ్రెస్‌లో రావాలని కోరుకుంటున్నారు. సర్వేల్లో నాకే అనుకూలంగా ఉన్నాయి. కేసీఆర్ ధన, అధికార మదంతో మాట్లాడుతున్నాడు. అవినీతి సొమ్ముతో ప్రధాని కావాలని ఇండియా కూటమికి నిధులు సమకూరుస్తానంటూ ఆఫర్ ఇచ్చాడు. ఈరోజు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉదయాన్నే ఉన్నందున రాత్రి మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో కండువా కప్పుకున్నాను. ఇప్పుడు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో మరోసారి కండువా కప్పించుకుంటాను’’ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.


కాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు, సంతోష్ కుమార్, నేతి విద్యాసాగర్, ఆకుల లలిత, కపిలవాయి దిలీప్ కుమార్, మోత్కుపల్లి నర్సింహులు ఇప్పటికే ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. మరికాసేపట్లో కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే సమక్షంలో నేతలు పార్టీలో చేరనున్నారు.

Updated Date - 2023-10-27T10:32:52+05:30 IST