Digvijay Singh: ఆ విషయంలో వైఎస్సార్ కీలక పాత్ర పోషించారు

ABN , First Publish Date - 2023-09-02T20:48:05+05:30 IST

దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి(YS Rajasekhar Reddy) ముక్కుసూటి మనిషి... ఆయనతో తన అనుబంధం విడదీయరానిదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్(Digvijay Singh) తెలిపారు. శనివారం నాడు హోటల్ దస్ పల్లాలో(At Hotel Dus Palla) కేవీపీ, రఘువీరారెడ్డి రూపొందించిన ‘‘రైతే రాజైతే’’ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

Digvijay Singh:  ఆ విషయంలో వైఎస్సార్ కీలక పాత్ర పోషించారు

హైదరాబాద్: దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి(YS Rajasekhar Reddy) ముక్కుసూటి మనిషి... ఆయనతో తన అనుబంధం విడదీయరానిదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్(Digvijay Singh) తెలిపారు. శనివారం నాడు హోటల్ దస్ పల్లాలో(At Hotel Dus Palla) కేవీపీ, రఘువీరారెడ్డి రూపొందించిన ‘‘రైతే రాజైతే’’ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా దిగ్విజయ్ సింగ్ పాల్గొని ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సీపీఐ నారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్, సీఏల్పీ నేత భట్టి విక్రమార్క, ఆనం రామనారాయణరెడ్డి, జస్టిస్ సుదర్శన్‌రెడ్డి , ప్రముఖ జర్నలిస్ట్ పి.సాయినాథ్ పలువురు నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ..‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో యుక్త వయస్సు నుంచే కీలకంగా పనిచేశారు. ఉచిత విద్యుత్ వైఎస్సార్(YSR) మానసపుత్రిక.. ఇందిరమ్మ ఇళ్లు వైఎస్సార్ చలువే..అవే విధానాలను జగన్మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారు. నక్సలైట్ల(Naxalites)తో చర్చలు జరిపి జనజీవన స్రవంతిలోకి తీసుకురావడంలో వైఎస్సార్ కీలకభూమిక పోషించారు. 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే జలయజ్ఞంకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ మరణించి ఉండకుంటే తెలుగు రాష్ట్రాలు మరోలా ఉండేవి.. శ్రతువులు కూడా మెచ్చే గుణం వైఎస్సార్‌కు ఉంది.రాజశేఖర్‌రెడ్డి దగ్గర నేను ఎంతో నేర్చుకున్నాను..వైఎస్సార్ బతికి ఉంటే బీజేపీ(BJP) తీసుకువచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నాకు దిగేవారు..వైఎస్సార్ లేకపోయి ఉంటే 2004, 2009లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడకపోయేది. వైఎస్సార్ బతికి ఉంటె దేశంలో ఇప్పుడు ఉన్న విపత్కర పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడే వారు’’ అని దిగ్విజయ్ సింగ్ తెలిపారు.

Updated Date - 2023-09-02T20:48:05+05:30 IST