TS Govt: హైదరాబాద్‌లో గోదాంలపై కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2023-02-02T11:16:45+05:30 IST

నగరంలోని పలు గోదాంలలో తరచూ అగ్నిప్రమాదాలు సంభవిస్తున్న నేపథ్యంలో గోదాంలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

TS Govt: హైదరాబాద్‌లో గోదాంలపై కీలక నిర్ణయం

హైదరాబాద్: నగరంలోని పలు గోదాంలలో తరచూ అగ్నిప్రమాదాలు సంభవిస్తున్న నేపథ్యంలో గోదాంలపై ప్రభుత్వం కీలక నిర్ణయం (Telangana Government Crucial decision on warehouses in Hyderabad) తీసుకుంది. నిబంధనలు ఉల్లఘించి నడుస్తున్న వేలాది గోదాంలను ప్రభుత్వం (Telangana Govenment) గుర్తించింది. ఈ క్రమంలో గోదాం యజమానుల (Warehouse owners)కు నోటీసులు జారీ (Issuance of notices) చేయాలని అధికారుల (Officers)కు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. నోటీసుల తరువాత నిబంధనలు పాటించకపోతే క్రిమినల్ కేసులు నమోదు (Registration of criminal cases) చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో సెంట్రల్ జోన్‌లో గోదాం యజమానులకు నోటీసులు ఇస్తామని డీసీపీ వెంకటేశ్వర్లు (DCP Venkateshwarlu) తెలిపారు. కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (Commercial Establishment)కు ఇక నుంచి పోలీస్ అనుమతి (Police permission) తప్పనిసరి అని స్పష్టం చేశారు.

ఒకే రోజు రెండు అగ్నిప్రమాదాలు....

సికింద్రాబాద్‌లోని డక్కన్‌మాల్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన (Fire incident in Dhakanmall Secunderabad)ను మరువకముందే భాగ్యనగరం (Hyderabad) లో మరికొన్ని ఘటనలు చోటుచేసుకున్నాయి. గురువారం ఉదయం ఒకేరోజు రెండు చోట్ల అగ్నిప్రమాదాలు సంభవించాయి. టైర్ల గోదాం, డెకరేషన్ గోదాంలలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

టైర్ల గోదాంలో... వనస్థలిపురంలోని టైర్ల గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. టైర్ల రీబటన్ కంపెనీతో పాటు గోదాంలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

డెకరేషన్ గోదాంలో... మరోవైపు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ (Chikkadapalli Police Staion) పరిధి బాగ్‌లింగంపల్లి డెకరేషన్ గోదాంలోనూ మంటలు చెలరేగాయి. వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని గంటన్నర పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గోదాంలో థర్మోకోలు, ఫైబర్, ప్లాస్టిక్, చెక్క,స్పాంజ్‌కు సంబంధించిన సామాన్లు ఉండటంతో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. దాదాపు ఆరు ఫైరింజన్లతో అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే భారీ ఆస్తి నష్టం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదానికి కారణంగా అధికారులు భావిస్తున్నారు. గోదాంలో ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఎక్కడా కనిపించని పరిస్థితి. మంటలు అదుపులోకి వచ్చాయి కానీ ఇంకా నల్లటి పొగ వస్తూనే ఉందని ఫైర్ సిబ్బంది తెలిపారు.

విషయం తెలిసిన వెంటనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. జరిగిన ప్రమాదంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా... అగ్నిప్రమాదంలో భవనం పూర్తి దెబ్బతిన్నది. దీంతో భవనాన్ని కూల్చివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే హైదరాబాద్‌లో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. గోదాంలతో వ్యాపారులు ఫైర్‌ సేఫ్టీ పరికరాలు (Fire safety equipment) ఉంచకుండా అజాగ్రత్తగా ఉండటమే ప్రమాదానికి కారణాలుగా తెలుస్తోంది.

ఇకపై చెప్పం... సీరియస్ యాక్షనే: తలసాని

వరుస అగ్నిప్రమాదాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Telangana Minister) సీరియస్ అయ్యారు. అగ్ని ప్రమాదాలు ఎన్ని జరుగుతున్నా ఇంకా వ్యాపారస్తుల్లో మార్పు రావట్లేదన్నారు. వరుస ప్రమాదాలను చూసైనా వారిలో చైతన్యం రావాలన్నారు. ఇకమీదట వ్యాపారస్తులకు చెప్పడం అనేది ఉండదు సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. ఒకరి వల్ల ఇతరులకు నష్టం జరుగుతుంటే ఎవరు ఆ నష్టాన్ని భరించే పరిస్థితిలో లేరన్నారు. ఇప్పటికైనా వ్యాపారస్తుల్లో మార్పు రావాలని మంత్రి సూచించారు.

రాబోయేది అసలే వేసవికాలం కాబట్టి అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటికే అగ్ని ప్రమాదాలకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఉన్నత స్థాయి సమావేశం లో కీలక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నిబంధనలు ఉల్లగించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్‌లో వేలాది గోదాంలు నిబంధనలు విరుద్ధంగా నడుస్తున్నాయన్నారు. రాబోతున్న వేసవిలో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని... తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి తలసాని తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.

Updated Date - 2023-02-02T11:22:50+05:30 IST