Share News

CP Srinivas Reddy: హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించాలి

ABN , Publish Date - Dec 17 , 2023 | 06:08 PM

రెండు నెలల్లో హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించాలని సిటీ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ( CP Kothakota Srinivas Reddy ) పేర్కొన్నారు. ఆదివారం నాడు సీపీ కార్యాలయంలో హైదరాబాద్‌ సీటీ పోలీసు బృందంతో సమావేశం అయ్యారు. కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

CP Srinivas Reddy: హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించాలి

హైదరాబాద్‌: రెండు నెలల్లో హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించాలని సిటీ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ( CP Kothakota Srinivas Reddy ) పేర్కొన్నారు. ఆదివారం నాడు సీపీ కార్యాలయంలో హైదరాబాద్‌ సీటీ పోలీసు బృందంతో సమావేశం అయ్యారు. కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘డ్రగ్స్‌ని పూర్తిగా కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టాలి. సిటీలో డ్రగ్స్, గంజాయి మాట వినపడద్దు. నిజమైన బాధితుడికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్ వర్తిస్తుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. పోలీస్ కమిషనర్ పెరు చెప్పి పైరవీలు చేసే వారి పట్ల కఠిన చర్యలు ఉంటాయి’’ అని కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. ఇటీవల హైదరాబాద్‌ సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

Updated Date - Dec 17 , 2023 | 06:09 PM