CM Revanth Reddy: సోమవారం సెక్రటేరియట్‌లో అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
ABN , First Publish Date - 2023-12-10T22:38:25+05:30 IST
సెక్రటేరియట్‌లో సోమవారం అధికారులతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) సమీక్ష సమావేవం నిర్వహించనున్నారు. రేపు ఉదయం 10.30గంటలకు సెక్రటరియట్‌కి సీఎం రేవంత్‌రెడ్డి రానున్నారు.
హైదరాబాద్: సెక్రటేరియట్‌లో సోమవారం అధికారులతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రేపు ఉదయం 10.30గంటలకు సెక్రటేరియట్‌కి సీఎం రేవంత్‌రెడ్డి రానున్నారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (Mcrhrd) అధికారులతో సమావేశం అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈరోజు (ఆదివారం) సంబంధిత అధికారులతో కలిసి ఎంసీహెచ్‌ఆర్డీ(Mcrhrd)లో సీఎం పరిశీలించిన విషయం తెలిసిందే. అనంతరం అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఎంసీహెచ్‌ఆర్డీ(Mcrhrd) సీఎం క్యాంపు కార్యాలయానికి అణుగుణంగా ఉంటుందా లేదా అన్న దానిపై నివేదికతో రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.