Share News

Allu Arvind: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం

ABN , First Publish Date - 2023-12-04T14:01:25+05:30 IST

Telangana: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయంపై సినీ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం సంతోషంగా ఉందన్నారు.

Allu Arvind: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయంపై సినీ నిర్మాత అల్లు అరవింద్ (Film producer Allu Aravind) స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) రావడం సంతోషంగా ఉందన్నారు. సినీ పరిశ్రమను ఆదుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త కాదని చెప్పుకొచ్చారు. ఇంతకు ముందున్న ప్రభుత్వాలు సినీ పరిశ్రమను ఎంతో ప్రోత్సహించాయన్నారు. ఈ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తుందనుకుంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామన్నారు. త్వరలోనే సినీ పరిశ్రమ తరపున కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కలుస్తామని అల్లు అరవింద్ పేర్కొన్నారు.

Updated Date - 2023-12-04T14:01:27+05:30 IST