Share News

Chinnajeeyar Swamy: కేసీఆర్‌ని పరామర్శించిన చిన్నజీయర్ స్వామి

ABN , First Publish Date - 2023-12-09T21:03:35+05:30 IST

బీఆర్ఎస్ ( BRS ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR ) కి సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో శుక్రవారం నాడు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో కేసీఆర్‌కు 20 మంది వైద్యుల బృందం సర్జరీ పూర్తి చేసిన విషయం తెలిసిందే. కాగా.. కేసీఆర్‌ని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి ( Chinnajeeyar Swamy ) శనివారం నాడు యశోద ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు.

Chinnajeeyar Swamy: కేసీఆర్‌ని పరామర్శించిన చిన్నజీయర్ స్వామి

హైదరాబాద్: బీఆర్ఎస్ ( BRS ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR ) కి సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో శుక్రవారం నాడు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో కేసీఆర్‌కు 20 మంది వైద్యుల బృందం సర్జరీ పూర్తి చేసిన విషయం తెలిసిందే. కాగా.. కేసీఆర్‌ని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి ( Chinnajeeyar Swamy ) శనివారం నాడు యశోద ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు. అనంతరం వైద్యులతో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని చిన్న జీయర్ స్వామి ఆకాక్షించారు. అనంతరం అక్కడే ఉన్న కుటుంబ సభ్యులతో చిన్న జీయర్ స్వామి కొంతసేపు మాట్లాడినట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-12-09T21:09:54+05:30 IST