Share News

Chandrababu Arrest: హైదరాబాద్‌ మెట్రోలో బాబు మద్దతుదారుల నిరసన

ABN , First Publish Date - 2023-10-14T10:06:28+05:30 IST

స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనేక మద్దతుతెలుపుతూ నిరసనకు దిగుతున్నారు. హైదరాద్‌లో ఐటీ ఉద్యోగులు చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ర్యాలీలు నిర్వహించిన విషయం తెలిసిందే.

Chandrababu Arrest: హైదరాబాద్‌ మెట్రోలో బాబు మద్దతుదారుల నిరసన

హైదరాబాద్: స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu) అనేక మద్దతు తెలుపుతూ నిరసనకు దిగుతున్నారు. హైదరాద్‌లో ఐటీ ఉద్యోగులు చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ర్యాలీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా చంద్రబాబుకు సంఘీభావంగా మెట్రోలో బాబు మద్దతుదారులు నిరసన చేపట్టారు. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో రైల్‌లో ప్రయాణిస్తూ నిరసనకు బాబు మద్దతుదారులు పిలుపునిచ్చారు. ఈక్రమంలో మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే స్టేషన్లోకి పోలీసులు అనుమతిస్తున్నారు. బ్లాక్ టీ షర్ట్లు ధరించిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

Updated Date - 2023-10-14T10:06:28+05:30 IST