Share News

TS NEWS: చాదర్‌ ఘాట్ పోలీసుల అలసత్వం

ABN , Publish Date - Dec 24 , 2023 | 04:28 PM

గరంలోని చాదర్‌ ఘాట్ ( Chadar Ghat ) పోలీసులు విధుల్లో అలసత్వం ప్రదర్శించారు. చాదర్ ఘాట్ సమీపంలో ఓ కుటుంబం ఉంటుంది. అయితే గత 20 రోజులుగా కొడుకు కనిపించకపోవడంతో చాదర్‌ఘాట్ పోలీసులకు ఈనెల 11వ తేదీన బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా పోలీసులు ఆచూకీ కనిపెట్టకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు.

TS NEWS: చాదర్‌ ఘాట్ పోలీసుల అలసత్వం

హైదరాబాద్: నగరంలోని చాదర్‌ ఘాట్ ( Chadar Ghat ) పోలీసులు విధుల్లో అలసత్వం ప్రదర్శించారు. చాదర్ ఘాట్ సమీపంలో ఓ కుటుంబం ఉంటుంది. అయితే గత 20 రోజులుగా కొడుకు కనిపించకపోవడంతో చాదర్‌ఘాట్ పోలీసులకు ఈనెల 11వ తేదీన బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా పోలీసులు ఆచూకీ కనిపెట్టకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు. అయితే.. ఆస్పత్రిలో 20 రోజుల క్రితమే మృతి చెందాడని తెలియడంతో కుటుంబ సభ్యులు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుతో తన కొడుకు అనాథ శవంగా ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో పడి ఉన్నాడని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6వ తేదీ అర్థరాత్రి ఓ కారు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ ఉద్యోగి శ్రవణ్ కుమార్ (23) అనే యువకుడు తీవ్ర గాయాలు అయి మృతిచెందాడు. పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఆ రోడ్డు ప్రమాదంలో శ్రవణ్ కుమారే చనిపోయినట్టు పోలీసులు ఆలస్యంగా గుర్తించారు.

Updated Date - Dec 24 , 2023 | 04:28 PM