Motkupalli Narasimhulu: చంద్రబాబు అరెస్ట్‌పై జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి

ABN , First Publish Date - 2023-09-23T16:43:18+05:30 IST

చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించాలి. చంద్రబాబు ప్రభుత్వంలో కేసీఆర్ పనిచేశారు. నేను ఎన్టీఆర్ ప్రభుత్వంలో పనిచేశాను. రాజకీయాలు పక్కన పెట్టి కేసీఆర్ స్పందిస్తే.. ప్రజాస్వామ్యానికి మంచిది. నేను బీఆర్ఎస్‌లోనే

Motkupalli Narasimhulu: చంద్రబాబు అరెస్ట్‌పై జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి

హైదరాబాద్: చంద్రబాబు అక్రమ అరెస్టును (Chandrababu) మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు (Motkupalli Narasimhulu ) తీవ్రంగా ఖండించారు. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించి మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘రాజ్యం ఎల్లకాలం ఉండదని నియంత జగన్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. గవర్నర్ అనుమతి లేకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయటం దుర్మార్గం. ఏడు, ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్ ఉండగా.. రూ.371 కోట్లకు చంద్రబాబు ఆశ పడతారా?, కక్ష సాధింపు చంద్రబాబుకు చేతకాదు.. జగన్ (Cm jagan) మాదిరి క్రిమినల్ అంతకంటే కాదు. అధికార మైకంలో ఉండి అహకారంతో జగన్ పరిపాలన చేస్తున్నారు. జగన్ గెలవాలని ఇదే ఎన్టీఆర్ ఘాట్‌లో ఆకాంక్షించాను. నా మాటతో దళిత వర్గాలన్నీ ఏకమై జగన్‌ను గెలిపించాయి. తల్లిని ఇంటి నుంచి బయటకు పంపిన చరిత్ర జగన్‌ది. అన్న కోసం పాదయాత్ర చేసిన షర్మిలకు జగన్ అన్యాయం చేశారు. రాజధాని లేని రాజ్యాన్ని ఏలుతోన్న నియంత జగన్. ఏపీకి తప్పా.. తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉంది. పిచ్చి నెత్తికెక్కింది‌. భయభ్రాంతులకు క్రియేట్ చేసి జగన్ రాజ్యం ఏలుతున్నారు. ఏపీలో ప్రజాస్వామ్య వాదులు మేల్కొనాలి.’’ అని పిలుపునిచ్చారు.

కేసీఆర్ స్పందించాలి

‘‘చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించాలి. చంద్రబాబు ప్రభుత్వంలో కేసీఆర్ పనిచేశారు. నేను ఎన్టీఆర్ ప్రభుత్వంలో పనిచేశాను. రాజకీయాలు పక్కన పెట్టి కేసీఆర్ స్పందిస్తే.. ప్రజాస్వామ్యానికి మంచిది. నేను బీఆర్ఎస్‌లోనే ఉన్నాను. వ్యక్తిగతంగానే చంద్రబాబు అరెస్ట్‌పై స్పందిస్తున్నాను. జగన్.. చంద్రబాబు నెత్తిన పాలు పోశారు. ఎన్నికల్లో చంద్రబాబు గెలుస్తారు. జగన్ మాదిరి దుర్మార్గం పరిపాలన రాజశేఖరరెడ్డి చేయలేదు.’’ అని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు.

జగన్ క్షమాపణ చెప్పాలి

చంద్రబాబు అరెస్ట్‌పై జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. త్వరలో రాజమండ్రి వెళ్ళి నారా భువనేశ్వరిని పరామర్శిస్తా. అవకాశమిస్తే జైల్లో ఉన్న చంద్రబాబును కూడా పరామర్శిస్తా. రానున్న ఎన్నికల్లో దళితులు జగన్‌కు ఓట్లు వేయరు గాక వేయరు. చంద్రబాబు అరెస్ట్‌కు జగన్ మూల్యం చెల్లించుకోక తప్పదు. జగన్ ఎవరకీ అక్కరకు రాని ముఖ్యమంత్రి. దళితుల ప్రాణాలకు జగన్‌కు లెక్క లేదు. జగన్ పాలనలో డాక్టర్ సుధాకర్ సహా.. కాకికాడ, పులివెందుల, చీరాల్లో దళిళులపై హత్యలు జరిగాయి.’’ అని మోత్కుపల్లి గుర్తుచేశారు.

బాబుకు మద్దతుగా దీక్ష చేస్తా

చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా దీక్ష చేయబోతున్నట్లు మోత్కుపల్లి ప్రకటించారు. రేపు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఒక్క రోజు నిరసన దీక్ష చేయనున్నట్లు వెల్లడించారు.

Updated Date - 2023-09-23T16:43:18+05:30 IST