Share News

Boyapati Srinu: చరిత్ర ఉన్నంత వరకు చంద్రబాబు ఉంటారు

ABN , First Publish Date - 2023-10-29T21:48:42+05:30 IST

చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) ఉంటారని దర్శకులు బోయపాటి శ్రీను ( Boyapati Srinu )వ్యాఖ్యానించారు.

Boyapati Srinu:  చరిత్ర ఉన్నంత వరకు చంద్రబాబు ఉంటారు

హైదరాబాద్: చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) ఉంటారని దర్శకులు బోయపాటి శ్రీను ( Boyapati Srinu )వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు హైదరాబాద్ లోని హైటెక్ సిటీ సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఐటీ ఉద్యోగులు హైదరాబాదులో సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు బోయపాటి శ్రీను హాజరయ్యారు. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ‘‘బాబు బయటకి రావాలి, అధికారం లోకి రావాలని న్యాయ పోరాటం చేస్తున్న వారికి కృతజ్ఞతలు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ప్రపంచంలో తలెత్తుక్కొని తిరిగేలా చేశాడు. చంద్రబాబుకు అండగా నిలిచిన ఉద్యోగులకు నా కృతజ్ఞతలు. త్వరలోనే చంద్రబాబు బయటికి వస్తారు, న్యాయాన్ని గెలిపించుకొని వస్తారు. ఐయామ్ విత్ యూ బాబు’’ అని బోయపాటి శ్రీనుపేర్కొన్నారు.

Updated Date - 2023-10-29T21:48:42+05:30 IST