Share News

BJP List: ఒకే ఒక్క పేరుతో తెలంగాణ బీజేపీ రెండో జాబితా

ABN , First Publish Date - 2023-10-27T14:39:03+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గాను బీజేపీ రెండో జాబితా విడుదలైంది. కేవలం ఒకే ఒక్క పేరుతో రెండో జాబితాను బీజేపీ హైకమాండ్ విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్‌ కమిటీ ప్రకటనను విడుదల చేసింది.

BJP List: ఒకే ఒక్క పేరుతో తెలంగాణ బీజేపీ రెండో జాబితా

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ((Telangana Assembly Elections 2023) గాను బీజేపీ (BJP List) రెండో జాబితా విడుదలైంది. కేవలం ఒకే ఒక్క పేరుతో రెండో జాబితాను బీజేపీ హైకమాండ్ విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్‌ కమిటీ ప్రకటనను విడుదల చేసింది. మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఏపీ మిథున్ కుమార్ రెడ్డిని (AP Mithunkumar Reddy) బీజేపీ అధిష్టానం ప్రకటించింది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి (Former MP Jitender Reddy) కుమారుడే మిథున్ కుమార్ రెడ్డి.


కాగా.. ఈనెల 22న బీజేపీ తొలి జాబితా విడుదలైన విషయం తెలిసిందే. మొత్తం 52 మంది అభ్యర్థులతో బీజేపీ తొలిజాబితా విడుదలైంది. ఈ సారి ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్ అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారు.

బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ఇదే..

  • సిర్పూర్ - డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు

  • బెల్లంపల్లి (ఎస్సీ) - అమరాజుల శ్రీదేవి

  • ఖానాపూర్ (ఎస్టీ) రమేష్ రాథోడ్

  • ఆదిలాబాద్ - పాయల్ శంకర్

  • బోథ్ - సోయం బాపు రావు

  • నిర్మల్ - ఆలేటి మహేశ్వర్ రెడ్డి

  • ముథోల్ - శ్రీరామరావు పటేల్

  • ఆర్మూర్ - శ్రీ పైడి రాకేష్ రెడ్డి

  • జుక్కల్ - అరుణ తార

  • బాల్కొండ - అన్నపూర్ణమ్మ ఆలేటి

  • కోరుట్ల - ధర్మపురి అర్వింద్

  • కామారెడ్డి - కె. వెంకట రమణా రెడ్డి

  • నిజామాబాద్ అర్బన్ - సూర్యనారాయణ గుప్తా

  • జగిత్యాల - డాక్టర్ బోగ శ్రావణి

  • ధర్మపురి (ఎస్సీ) - శ్రీ ఎస్ కుమార్

  • రామగుండం - కందుల సంధ్యా రాణి

  • కరీంనగర్ - బండి సంజయ్ కుమార్

  • చొప్పదండి - బొడిగ శోభ

  • సిరిసిల్ల - రాణి రుద్రమ రెడ్డి

  • మానకొండూర్ (ఎస్సీ) - శ్రీ ఆరేపల్లి మోహన్

  • హుజూరాబాద్ - ఈటల రాజేందర్

  • నర్సాపూర్ - ఎర్రగొల్ల మురళీ యాదవ్

  • పటాన్‌చెరు - నందీశ్వర్ గౌడ్

  • దుబ్బాక - మాదవనేని రఘునందన్ రావు

  • గజ్వేల్ - ఈటల రాజేందర్

  • కుత్బుల్లాపూర్ - కూన శ్రీశైలం గౌడ్

  • ఇబ్రహీంపట్నం - నోముల దయానంద్ గౌడ్

  • మహేశ్వరం - అందెల శ్రీరాములు యాదవ్

  • ఖైరతాబాద్ - చింతల రామచంద్రారెడ్డి

  • కార్వాన్ - అమర్ సింగ్

  • గోషామహల్ - టి రాజా సింగ్

  • చార్మినార్ - మేఘ రాణి

  • చాంద్రాయణగుట్ట - సత్యనారాయణ ముదిరాజ్

  • యాకుత్‌పురా - వీరేందర్ యాదవ్

  • బహదూర్‌పురా - వై. నరేష్ కుమార్

  • కల్వకుర్తి - తల్లోజు ఆచారి

  • కొల్లాపూర్ - ఆల్లెని సుధాకర్ రావు

  • నాగార్జున సాగర్ - కంకణాల నివేదిత రెడ్డి

  • సూర్యాపేట - సంకినేని వెంకటేశ్వర్ రావు

  • భువనగిరి - గూడూరు నారాయణ రెడ్డి

  • తుంగతుర్తి (ఎస్సీ) - కడియం రాంచంద్రయ్య

  • జనగాం - డాక్టర్ ఆరుట్ల దశమంత్ రెడ్డి

  • స్టేషన్ ఘన్‌పూర్ (ఎస్సీ) - డాక్టర్ గుండె విజయ రామారావు

  • పాలకుర్తి - లేగా రాంమోహన్ రెడ్డి

  • డోర్నకల్ (ఎస్టీ) - భూక్య సంగీత

  • మహబూబాబాద్ (ఎస్టీ) - జాథోట్ హుస్సేన్ నాయక్

  • వరంగల్ పశ్చిమ - రావు పద్మ

  • వరంగల్ తూర్పు - ఎర్రబెల్లి ప్రదీప్ రావు

  • వర్ధన్నపేట (ఎస్సీ) - కొండేటి శ్రీధర్

  • భూపాలపల్లె - చందుపట్ల కీర్తి రెడ్డి

  • ఇల్లందు (ఎస్టీ) - రవీంద్ర నాయక్

  • భద్రాచలం (ఎస్టీ) - కుంజా ధర్మ రావు

Updated Date - 2023-10-27T16:40:41+05:30 IST