Etela Rajender: ‘చెప్పేవి గొప్పలు చేసేవి శూన్యం అన్నట్టుగా బడ్జెట్’

ABN , First Publish Date - 2023-02-06T14:00:26+05:30 IST

శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విరుచుకుపడ్డారు.

Etela Rajender: ‘చెప్పేవి గొప్పలు చేసేవి శూన్యం అన్నట్టుగా బడ్జెట్’

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో ప్రభుత్వం (TS Government) ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (BJP MLA Etela Rajender) విరుచుకుపడ్డారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... చెప్పేవి గొప్పలు చేసేవీ శూన్యం అన్నట్టుగా బడ్జెట్ ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రజలను మోసం చేసే బడ్జెట్ తీసుకొచ్చారన్నారు. రైతాంగానికి రుణమాఫీ (Loan waiver for farmers) నాలుగేళ్లు అయినా చేయలేదని తెలిపారు. అత్యధిక ఎగవేత దళారులుగా రైతులపై ముద్ర పడుతుందన్నారు. రైతు రుణమాఫీపై ఊసే లేదని.. చేస్తారా లేదా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల (Employees) కు వేతనాలు మొదటి తేదీ రాకపోవడంతో ఈఎంఐ (EMI)లు సమయానికి చెల్లించలేకపోతున్నారన్నారు. మధ్యాహ్నం భోజనం వండే వారికి వెయ్యి రూపాయలు ఇస్తున్నారని.. అవి కూడా రెండేళ్ళకు ఓ సారి ఇస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కిట్‌ (KCR Kit)కు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదన్నారు. అంగన్ వాడీ (Angan Wadi)లకు డబ్బు సరిగా ఇవ్వకపోవడంతో ముక్కిపోయిన ఆహారం అందుతోందని బీజేపీ ఎమ్మెల్యే తెలిపారు.

బాసర త్రిపుల్ ఐటీ (Basara IIIT)లో ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు. గురుకులలో సరైన వసతులు లేవని.. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మన ఊరు మన బడి కేవలం చెప్పడానికే రంగురంగులుగా కనిపిస్తుందని వ్యాఖ్యలు చేశారు. ఈహెచ్ఎస్ పేరుతో ప్రైవేటు ఆసుపత్రి (Private Hospital)లో చికిత్స ఇవ్వలేమంటున్నారని... ఆసుపత్రిలలో మందులు కూడా అందడం లేదన్నారు. విద్యావాలంటరీలకు... విదేశీ విద్యకు వెళ్లే వారికి సరైన సమయానికి డబ్బు రావడం లేదని తెలిపారు. కాంట్రాక్టర్‌లకు ఏ శాఖలోనూ సమయానికి బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్నారని ఈటల రాజేందర్ అన్నారు.

Updated Date - 2023-02-06T14:21:42+05:30 IST