Arvind: తెలంగాణ సచివాలయంపై బీజేపీ జెండా ఎగరడం ఖాయం

ABN , First Publish Date - 2023-01-07T18:20:31+05:30 IST

తెలంగాణ సచివాలయం (Telangana Secretariat)పై బీజేపీ (BJP) జెండా ఎగరడం ఖాయమని బీజేపీ ఎంపీ అర్వింద్‌ (BJP MP Arvind) జోస్యం చెప్పారు.

Arvind: తెలంగాణ సచివాలయంపై బీజేపీ జెండా ఎగరడం ఖాయం

హైదరాబాద్: తెలంగాణ సచివాలయం (Telangana Secretariat)పై బీజేపీ (BJP) జెండా ఎగరడం ఖాయమని బీజేపీ ఎంపీ అర్వింద్‌ (BJP MP Arvind) జోస్యం చెప్పారు. కేసీఆర్ ముందస్తుకు పోతే రాష్ట్రంలో ప్రెసిడెంట్‌ పాలన వస్తుందని, తెలంగాణలో కోటి ఎకరాల మాగాణి ఎక్కడో కేసీఆర్‌ చెప్పాలి? అని అర్వింద్‌ డిమాండ్ చేశారు. డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు 3 నియోజకవర్గాలకే పరిమితమయ్యాయని, కేంద్రం ఇచ్చిన పంచాయతీల నిధులనూ దారిమళ్లిస్తున్నారని ఎంపీ అర్వింద్‌ ఆరోపించారు.

Updated Date - 2023-01-07T18:22:34+05:30 IST