Share News

Vivek Venkataswamy: నాపై ఐటీ -ఈడీ దాడులు బీఆర్ఎస్ -బీజేపీ కలిసి చేసిన కుట్రే

ABN , First Publish Date - 2023-11-21T22:10:47+05:30 IST

మంచిర్యాలలోని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వివేక్ ( Vivek Venkataswamy ) నివాసంలో ఉదయం 5గంటల నుంచి ఐటీ-ఈడీ బృందాలు సోదాలు నిర్వహించింది. వివేక్ సహా కుటుంబ సభ్యులను ఐటీ-ఈడీ అధికారులు విచారించారు.

Vivek Venkataswamy: నాపై ఐటీ -ఈడీ దాడులు బీఆర్ఎస్ -బీజేపీ కలిసి చేసిన కుట్రే

మంచిర్యాల: మంచిర్యాలలోని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ( Vivek Venkataswamy ) నివాసంలో ఉదయం 5గంటల నుంచి ఐటీ-ఈడీ బృందాలు సోదాలు నిర్వహించింది. వివేక్ సహా కుటుంబ సభ్యులను ఐటీ-ఈడీ అధికారులు విచారించారు. రూ.8కోట్ల నగదు బదిలీపై ఆరా తీశారు. షెల్ కంపెనీకి నగదు బదిలీ చేసినట్టు అభియోగాలు రావడంతో ఐటీ-ఈడీ బృందాలు ఈ సోదాలు చేసింది. అయితే ఈ దాడులపై వివేక్ వెంకటస్వామి ఏమన్నారంటే.. ‘‘నా ఇంటిపై ఐటీ-ఈడీ దాడులు.. బీఆర్ఎస్ -బీజేపీ పార్టీలు కలిసి చేసిన రాజకీయ కుట్రే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు తెలియకుండా ఈ దాడులు జరగలేదు. ఎన్నికల ముందు కావాలనే దాడులు చేస్తున్నారు. కేసీఆర్.. దమ్ముంటే రాజకీయంగా కొట్లాడాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతున్నానని కేసీఆర్‌కి భయం పట్టుకుంది. భయంతో నాపై ఐటీ -ఈడీ దాడులు చేయించారు’’ అని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు.

కేసీఆర్, కేటీఆర్, కవితల ఇళ్లలో కూడా సోదాలు చేయాలి

‘‘ఈడీని, పోలీసులను వాడుకుని రైడ్ చేస్తే ఏమి లాభం. బీఆర్ఎస్ ఓడిపోతుందని సుమన్‌తో ఒక లేఖ రాయించి దాడులు చేయించారు. కేసీఆర్, కేటీఆర్, కవితల ఇళ్లలో కూడా సోదాలు చేయాలి.హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలోనూ ఇలాగే చేశారు. నాలుగేళ్లుగా నన్ను వేధిస్తున్నారు.కాంగ్రెస్ గెలుస్తుందన్న అక్కసుతోనే దాడులు చేస్తున్నారు. ఓటమి భయంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఈ దాడులు చేయిస్తున్నారు. మా సంస్థలకు ఐటీ క్లియరెన్స్ ఇచ్చింది. కాళేశ్వరం అక్రమాలు, లిక్కర్ స్కామ్, మిషన్ భగీరథ.. స్కామ్‌లపై మాట్లాడుతున్నాననే నన్ను టార్గెట్‌ చేశారు. నేను కేసీఆర్ అక్రమాలపై ఫిర్యాదు చేసినా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పట్టించుకోలేదు. బాల్క సుమన్ ఫిర్యాదు చేస్తే మాత్రం నా ఇంటిపై ఐటీ-ఈడీ బృందాలతో దాడులు చేయించారు’’ అని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-11-21T22:10:54+05:30 IST