Amith Shah: కేసీఆర్‌ను సీఎం.. రాహుల్‌ను పీఎం చేయాలనే...
ABN , First Publish Date - 2023-11-27T15:32:05+05:30 IST
Telangana Elections: బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే కుటుంబ సీఎం అవుతాడని.. బీజేపీకి ఓటు వేస్తే బీసీ సీఎం అవుతాడని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.
కరీంనగర్: బీఆర్‌ఎస్ (BRS), కాంగ్రెస్‌కు (Congress) ఓటు వేస్తే కుటుంబ సీఎం అవుతాడని.. బీజేపీకి ఓటు వేస్తే బీసీ సీఎం అవుతాడని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Central Minister Amit Shah) అన్నారు. కరీంనగర్‌లో ఎన్నికల ప్రచారంలో అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. పేదల తరుపున మాట్లాడినందుకే సీఎం కేసీఆర్ ఈటలపై కక్ష్య పెంచుకొని పార్టీ నుంచి బయటకి పంపారని ఆరోపించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ఒప్పదం జరిగిందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ను సీఎం, కేంద్రంలో రాహుల్‌ను పీఎం చేయాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటే అని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్ తీసివేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి మోడీ అరవై లక్షలు కోట్లు ఇచ్చారని అమిత్ షా వెల్లడించారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి