Share News

Kishan Reddy: కర్ణాటకలో ఐదు గ్యారంటీలకే దిక్కు లేదు... ఆరు గ్యారంటీలకు దిక్కు ఉంటుందా?

ABN , First Publish Date - 2023-11-20T12:27:01+05:30 IST

అధికారంలోకి రాగానే కేసీఆర్ సర్కార్ అవినీతిపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు.

Kishan Reddy: కర్ణాటకలో ఐదు గ్యారంటీలకే దిక్కు లేదు... ఆరు గ్యారంటీలకు దిక్కు ఉంటుందా?

హైదరాబాద్: అధికారంలోకి రాగానే కేసీఆర్ సర్కార్ (KCR Government) అవినీతిపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి (Telangana BJP Chief Kishan Reddy) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రానున్న వారం రోజుల్లో ప్రధాని మోదీ (PM Modi) ఆరు సభల్లో‌ పాల్గొంటారని తెలిపారు. కాంగ్రెస్‌కు (Congress) అధికారం ఇస్తే తెలంగాణ ప్రజల చేతిలోకి చిప్ప వస్తుందని అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన అవినీతికి మూల్యం తప్పదని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ, ఉప ఎన్నికల్లో డిపాజిట్ రాని కాంగ్రెస్‌కు బీజేపీని (BJP) విమర్శించే హక్కు లేదన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అన్ని రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఫీజులపై నియంత్రణ తీసుకొస్తాం‌మని... విద్య, వైద్య రంగాన్ని తీర్చి దిద్దుతామన్నారు. కాంగ్రెస్ అంటేనే ప్రజల నెత్తిమీద భస్మాసుర హస్తమంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం మేధావులు, కవులు, కళాకారులు అలోచన చేయాలన్నారు.


రైతులు సహా.. అన్ని వర్గాల నుంచి బీజేపీ మ్యానిఫెస్టోకు మంచి స్పందన వస్తోందని తెలిపారు. బీసీ, ఎస్సీలు బీజేపీ వెంట పూర్తిస్థాయిలో నడవబోతున్నారన్నారు. రైతుబంధును కొనసాగిస్తామని.. వరి పంటకు రూ.3,100 కనీస మద్దతు ధర ఇస్తామన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్ల కంటే ఎక్కువ అవసరం ఉండదని తెలిపారు. అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్ళ‌ పట్టాలు ఇస్తామని.. దేశవాళీ ఆవులను రైతులకు ఇస్తామన్నారు. నాలుగు శాతం మతపరమైన రిజర్వేషన్లను ఎత్తేసి హైకోర్టు తీర్పును అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీవి ఆచరణ సాధ్యం కాని హామీలన్నారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలకే దిక్కు లేదు. ఆరు గ్యారంటీలకు దిక్కు ఉంటుందా అంటూ కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-20T12:27:02+05:30 IST