Share News

Tammineni: కమ్యూనిస్టులకు ఓట్లు, సీట్లు ముఖ్యం కాదు

ABN , First Publish Date - 2023-12-06T20:15:46+05:30 IST

ఎన్నికల్లో కమ్యూనిస్టులకు ఓట్లు, సీట్లు ముఖ్యం కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ( Tammineni Veerabhadram ) పేర్కొన్నారు. బుధవారం నాడు నేలకొండపల్లిలో తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు. నూతన ప్రభుత్వం ప్రజా అనుకూల పాలన సాగించాలని ఆకాంక్షిస్తున్నామని తమ్మినేని వీరభద్రం చెప్పారు.

Tammineni: కమ్యూనిస్టులకు ఓట్లు, సీట్లు ముఖ్యం కాదు

ఖమ్మం జిల్లా: ఎన్నికల్లో కమ్యూనిస్టులకు ఓట్లు, సీట్లు ముఖ్యం కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ( Tammineni Veerabhadram ) పేర్కొన్నారు. బుధవారం నాడు నేలకొండపల్లిలో తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడుతూ... ‘‘తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు. నూతన ప్రభుత్వం ప్రజా అనుకూల పాలన సాగించాలని ఆకాంక్షిస్తున్నాం. రాష్ట్రంలో అభివృద్ధి కొంత జరిగినా ప్రజల పట్ల కేసీఆర్ అనుసరించిన అహంకార వైఖరి కారణంగానే ఓటమి పాలయ్యారు’’ అని తమ్మినేని వీరభద్రం తెలిపారు.

డబ్బు ప్రభావంతో ఫలితాలు తారుమారయ్యాయి

‘‘కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు ప్రజలకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనిపించింది. అధికారాన్ని చేపట్టేందుకు బీజేపీ పార్టీ కులాలు, మతాల పేరుతో తెలంగాణలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించినా దాని ప్రయత్నాలను ప్రజలు తిరస్కరించారు.ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావంతో ఫలితాలు తారు మారయ్యాయి. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి, గిట్టుబాటు ధర కల్పించాలి. నిరంతరం ప్రజల వెంటే ఉంటూ వారి సమస్యల సాధన కోసం సీపీఎం కృషి చేస్తుంది’’ అని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.

Updated Date - 2023-12-06T20:15:47+05:30 IST