Share News

Revanth Reddy: అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్‌ని మించిన వారు లేరు

ABN , First Publish Date - 2023-11-22T17:18:43+05:30 IST

అబద్దాలు చెప్పి మోసం చేయడంలో సీఎం కేసీఆర్‌ (CM KCR ) తో ప్రపంచంలోనే ఎవరూ పోటీ పడలేరని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) సెటైర్లు వేశారు.

Revanth Reddy:  అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్‌ని మించిన వారు లేరు

నారాయణ్ ఖేడ్‌: అబద్దాలు చెప్పి మోసం చేయడంలో సీఎం కేసీఆర్‌ (CM KCR ) తో ప్రపంచంలోనే ఎవరూ పోటీ పడలేరని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) సెటైర్లు వేశారు. బుధవారం నాడు నారాయణ్ ఖేడ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...‘‘మీ ఉత్సాహం చూస్తోంటే నారాయణ్ ఖేడ్ గడ్డపై సంజీవరెడ్డి 50 వేల మెజారిటీతో గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందిరమ్మ రాజ్యంలో నారాయణ ఖేడ్‌ను అభివృద్ధి చేసే బాధ్యత మాది. బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులను ఏడాదిలో పూర్తి చేస్తామని కేసీఆర్ చెప్పారు. కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టులు కడతామన్న కేసీఆర్ మందేసి ఫామ్ హౌస్‌లో పడుకున్నావా..? నల్లవాగు పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని కేసీఆర్ మాట తప్పిండు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రత్యేక నిధులతో ఇక్కడి తండాలను అభివృద్ధి చేస్తాం. సర్పంచులకు బిల్లులు రావాలంటే నియోజకవర్గంలో భూపాల్‌రెడ్డిని బండకేసి కొట్టాలి. కేసీఆర్ తాత దిగొచ్చినా.. నారాయణ్ ఖేడ్, జహీరాబాద్ పార్లమెంటు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-22T17:18:49+05:30 IST