Share News

DK Shivakumar: రేపు తెలంగాణలో డీకే శివకుమార్ ఎన్నికల ప్రచారం

ABN , First Publish Date - 2023-11-23T22:13:11+05:30 IST

పు తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ( DK Shivakumar ) ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

DK Shivakumar: రేపు తెలంగాణలో డీకే శివకుమార్ ఎన్నికల ప్రచారం

హైదరాబాద్: రేపు తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ( DK Shivakumar ) ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు రోజుల పాటు తెలంగాణలో డీకే శివకుమార్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. రేపు బెంగుళూరు నుంచి ఉదయం హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం కార్నర్ మీటింగ్‌లో డీకే శివకుమార్ పాల్గొననున్నారు. సాయంత్రం వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాలల్లో ప్రచార సభల్లో డీకే శివకుమార్ ప్రసగించనున్నారు. రాత్రి అంబర్ పేట నియోజకవర్గం కార్నర్ మీటింగ్‌లో డీకే శివకుమార్ పాల్గొననున్నారు. 25వ తేదీన హైదరాబాద్‌లోని పలు నియోజక వర్గాలల్లో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లల్లో డీకే శివ కుమార్పాల్గొననున్నారు.

Updated Date - 2023-11-23T22:13:15+05:30 IST