Ponguleti Srinivas: డిసెంబర్ 9న కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారు..
ABN , First Publish Date - 2023-11-22T10:24:45+05:30 IST
Telangana Elections: సాధించుకున్న తెలంగాణాలో కేసీఆర్ ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.
ఖమ్మం: సాధించుకున్న తెలంగాణాలో కేసీఆర్ (CM KCR) ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Paleru Congress Candidate Ponguleti Srinivas Reddy) ఆరోపించారు. బుధవారం నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం ఎన్నికల ప్రచారంలో పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దొరని గడీలోనే బంధించి శాశ్వతంగా రాజకీయ సమాధి చేయాలన్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నాణ్యమైన సన్నబియ్యం ఇస్తామన్నారు. కేసీఆర్ దోపిడీని రోజూ ప్రశ్నిస్తున్నామని రేవంత్ రెడ్డిని, తనను ఓడించడానికి డబ్బుల సంచులు పంపిస్తున్నారని మండిపడ్డారు. ‘‘మీరందరూ హస్తం గుర్తుకు ఓటేసి మీ గుండెల్లో ఉన్న శ్రీనన్నను గెలిపించండి’’ అని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిషరిస్తామన్నారు. డిసెంబర్ తొమ్మిదిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని.. రాబోయేది ఇందిరమ్మ రాజ్యం అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి