Share News

Bandi Sanjay: సీఎం కేసీఆర్ లాగా బీజేపీ ఏక్ నిరంజన్ పార్టీ కాదు

ABN , First Publish Date - 2023-11-15T19:01:56+05:30 IST

సీఎం కేసీఆర్ ( CM KCR ) లాగా ఏక్ నిరంజన్ పార్టీ మనది కాదని బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ( Bandi Sanjay ) అన్నారు.

Bandi Sanjay:  సీఎం కేసీఆర్ లాగా బీజేపీ ఏక్ నిరంజన్ పార్టీ  కాదు

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ( CM KCR ) లాగా ఏక్ నిరంజన్ పార్టీ మనది కాదని బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ( Bandi Sanjay ) అన్నారు. బుధవారం నాడు బిచ్కుందలో విజయ శంఖారావం సభ రోడ్ షో నిర్వహించారు. ఈ సభలో బండి సంజయ్ పాల్గొని మాట్లాడుతూ...‘‘బీజేపీ పార్టీలో ఎమ్మెల్యేలు అధిష్ఠానం అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటేనే సీఎం పోస్ట్ ప్రకటిస్తారు. మీరు నన్ను ఇలా సీఎం సీఎం అని నాపోస్ట్‌ను ఊడ పీకారు. సీఎం పీఎం అని ఇప్పుడున్న పోస్టును ఊడ పీకకండీ. అరుణక్క చెప్పింది తమ్ముండ్లను కలిసి పొమ్మని అందుకే వచ్చా. బీసీని ముఖ్యమంత్రిని చేయాలలంటే అరుణక్కను గెలిపించండి.జుక్కల్‌లో సరైన రోడ్లు లేవు. లెండి ప్రాజెక్ట్ నీళ్లు లేవు. ఓటర్లను జోకర్లగా తీసుకొని ఆటలు ఆడవద్దు కొంపలు మునిగిపోతాయి.ఇక్కడ ఆర్టీసీ డిపో లేదు.డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లేవు. ఇవన్నీ చేయని కేసీఆర్‌కు ఏం చేశాడని గత ఎన్నికల్లో ఓట్లేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ( BRS ) పార్టీ ఓడిపోతుంది.ట్విట్టర్ టిల్లు ( కేటీఆర్) ను ఇంకెప్పుడు ముఖ్యమంత్రిని చేస్తావంటూ కేసీఆర్‌తో కుటుంబ సభ్యుల్లో లోల్లి పడుతున్నారు’’ అని బండి సంజయ్ సెటైర్లు వేశారు.

Updated Date - 2023-11-15T19:02:01+05:30 IST