Share News

Amit Shah: ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు..

ABN , First Publish Date - 2023-11-25T11:41:42+05:30 IST

మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఇవాళ హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తెలంగాణపై వరాల జల్లు కురిపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే 4శాతం ముస్లిం రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. బీజేపీకి అవకాశమిస్తే వరి పంటకు వెయ్యి రూపాయల బోనస్ ఇస్తామన్నారు.

Amit Shah: ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు..

హైదరాబాద్: మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఇవాళ హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తెలంగాణపై వరాల జల్లు కురిపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే 4శాతం ముస్లిం రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. బీజేపీకి అవకాశమిస్తే వరి పంటకు వెయ్యి రూపాయల బోనస్ ఇస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ను ఇంటికి పంపించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా అమిత్ షా మార్చారు. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరటం ఖాయమని అమిత్ షా అన్నారు.

నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదు?

పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గిస్తూ.. మొదట కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. కేసీఆర్ హాయాంలో యువత సహా.. అన్ని వర్గాలు నిరాశలో ఉన్నాయని అమిత్ షా పేర్కొన్నారు. పాస్‌పోర్ట్, మియాపూర్ భూములు, ఔటర్ రింగ్ రోడ్, గ్రానైట్, మనీ లాండరింగ్.. కేసీఆర్ సర్కార్ అవినీతి మయమయ్యాయన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితబంధు పథకాలు వస్తున్నాయని అమిత్‌షా తెలిపారు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేసీఆర్ మాట తప్పారన్నారు. రూ.3,116 నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని అమిత్ షా ప్రశ్నించారు. రైతు రుణమాఫీ చేయడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందన్నారు. ఫార్మా సిటీ, విద్యా సిటీ, టెక్స్ టైల్స్ పార్క్.. ఎక్కడని ప్రశ్నించారు. కాంగ్రెస్ వలనే తెలంగాణ రాష్ట్రం ఆలస్యమవుతోందన్నారు. కాంగ్రెస్, ఎంఐఎంకు ఓటు వేస్తే.. బీఆర్ఎస్‌కు ఓటు వేసినట్లేనని అమిత్ షా పేర్కొన్నారు.

అవినీతి పరులను జైలుకు పంపుతాం..

ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. రెండు దశాబ్దాలుగా మాదిగ సామాజికవర్గానికి అన్యాయం జరుగుతోందని అమిత్ షా పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణను వేగవంతం చేయటం కోసం కేంద్ర కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఇంట్లో కూర్చుని ప్రభుత్వాన్ని నడిపేవారికి పరిపాలన ఏం తెలుసని ప్రశ్నించారు. ఫాంహౌస్‌లో కాదు‌ .. ముఖ్యమంత్రి సచివాలయంలో ఉండాలన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే విచారణ జరిపి అవినీతి పరులను జైలుకు పంపుతామని అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ప్రస్తుత పథకాలను కొనసాగిస్తామన్నారు. ఎంఐఎం వలనే కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించటం లేదన్నారు. కేంద్ర నిధులపై తెలంగాణ సీఎం కేసీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారు. దక్షిణాదిలో అన్ని రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ చేసిందని అమిత్ షా పేర్కొన్నారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-25T11:41:44+05:30 IST