Share News

India vs Australia టీ20 సిరీస్ ఎక్కడ చూడాలి? ఎలా చూడాలి?..

ABN , First Publish Date - 2023-11-26T08:35:02+05:30 IST

భారత్, ఆస్ట్రేలియా జట్లు రెండో టీ20 మ్యాచ్‌ కోసం సిద్ధమయ్యాయి. ఇప్పటికే మొదటి మ్యాచ్‌ గెలిచి సిరీస్‌లో అధిక్యంలోకి వెళ్లిన టీమిండియా రెండో టీ20లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. అందుకోసం ఈ మ్యాచ్‌లో మన జట్టు అన్ని విభాగాల్లో రాణించాలని పట్టుదలగా ఉంది. ముఖ్యంగా గత మ్యాచ్‌లో మన బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.

India vs Australia టీ20 సిరీస్ ఎక్కడ చూడాలి? ఎలా చూడాలి?..

తిరువనంతపురం: భారత్, ఆస్ట్రేలియా జట్లు రెండో టీ20 మ్యాచ్‌ కోసం సిద్ధమయ్యాయి. ఇప్పటికే మొదటి మ్యాచ్‌ గెలిచి సిరీస్‌లో అధిక్యంలోకి వెళ్లిన టీమిండియా రెండో టీ20లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. అందుకోసం ఈ మ్యాచ్‌లో మన జట్టు అన్ని విభాగాల్లో రాణించాలని పట్టుదలగా ఉంది. ముఖ్యంగా గత మ్యాచ్‌లో మన బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేయడంపై దృష్టి పెట్టారు. మొదటి మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. చివర్లో రింకూ సింగ్ మెరుపులు భారత్‌ను గెలిపించాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా 209 పరుగుల లక్ష్యాన్ని చేధిండం గమనార్హం. అయితే ఆ మ్యాచ్‌లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ పెదగా పరుగులు చేయలేకపోయారు. దీంతో ఈ మ్యాచ్‌లో వారు బ్యాటు ఘుళిపించాలని భావిస్తున్నారు. ఇక గత మ్యాచ్‌లో 200 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేక ఓటమిపాలైన ఆస్ట్రేలియా ఈ సారి సత్తా చాటాలని భావిస్తోంది.


అయితే వరల్డ్ కప్ మ్యాచ్‌లు ప్రసారమైన స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+హాట్ స్టార్‌లో ఈ మ్యాచ్‌లు రావడం లేదు. దీంతో భారత్, ఆస్ట్రేలియా సిరీస్‌ను ఎక్కడ చూడాలో తెలియక పలువురు అభిమానులు ఇబ్బందిపడుతున్నారు. భారత్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌ను టీవీల్లో అయితే స్పోర్ట్స్ 18, కలర్స్ సినీప్లెక్స్ ఛానెళ్లలో చూడొచ్చు. అయితే ఈ ఛానెల్స్ అన్ని రకాల డీటీహెచ్‌లలో ఉచితంగా అందుబాటులో లేవు. దీంతో కొన్ని డీటీహెచ్‌లలో వీటి కోసం ప్రత్యేకంగా రిచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీటీలో చూడాలనుకుంటే జియో సినిమా యాప్‌లో చూసేయేచ్చు. జియో సినిమా కోసం ప్రత్యకంగా రిచార్జ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జియో సిమ్ వినియోగదారులై ఉండి మొబైల్ రిచార్జ్ ఉంటే జియో సినిమా యాప్ ఉచితంగానే వస్తుంది. దీంతో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని మ్యాచ్‌లను ఎంజాయ్ చేయొచ్చు. కాగా మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభంకానున్నాయి. రెండో టీ20 మ్యాచ్ నేడు జరుగుతుండగా.. ఈ నెల 28న మూడో టీ20 మ్యాచ్, డిసెంబర్ 1న నాలుగో టీ20 మ్యాచ్, 3న చివరిదైన ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది.

Updated Date - 2023-11-26T08:35:04+05:30 IST